మహేష్ బాబు చేతుల మీదుగా నాంది సినిమా  ట్రైలర్ విడుదల...!

కామెడీ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గా అల్లరి నరేష్ నిలిచాడు.ఆయన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల హీరో.

 Mahesh Babu Launches Nandi Movie Trailer, Allari Naresh, Nandhi Movie, Movie Tra-TeluguStop.com

ఇక కామెడీ చిత్రాల‌తో పాటు ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న న‌టుడు అల్ల‌రి న‌రేష్‌.ఇక ఆయన సినిమా కెరీర్ లో గ‌మ్యం, శంభో శివ శంభో, ల‌డ్డూబాబు, మహర్షి వంటి విభిన్న క‌థా చిత్రాలు చేశాడు అల్ల‌రి న‌రేష్.

ఇక ప్ర‌స్తుతం విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాంది అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ను కొద్ది సేప‌టి క్రితం మ‌హేష్ విడుద‌ల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సినిమాలో చేయ‌ని త‌ప్పుకు జైలు శిక్ష అనుభ‌వించే వ్య‌క్తి పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ న‌టించారు.పూర్తి ప‌ర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా నాంది చిత్రం ఉండ‌నుంద‌ని స‌మాచారం.ఈ సినిమాతో న‌రేష్ లోని సరికొత్త కోణం బ‌య‌ట‌కు రానుంది.ఇక‌ లాయర్ గా టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మంచి రోల్ లో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో న‌వ‌మి, హ‌రీష్ ఉత్తమ‌న్‌, ప్రవీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్రసాద్‌, విన‌య్ వ‌ర్మ, సి.ఎల్‌.న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్రపాణి, రాజ్యల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్రమోదిని, గ్రిగ్నేశ్వర రావు ముఖ్య పాత్రలు పోషించారు.శ్రీచరణ్‌ పాకాల సంగీతం సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీ అందించారు.

బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.చోటా కె.ప్రసాద్ ఎడిటర్.అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు.

చైతన్య ప్రసాద్, శ్రీమణి సాహిత్యం అందించారు.తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌ అందరిని ఎంతో ఆకట్టుకుంది.

ఇక ఈ ట్రైల‌ర్‌ చుసిన వారంతా అల్లరి నరేష్ సినీ కెరీర్ లో మరో హీట్ గ్యారంటీ అని చెబితున్నారు.ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైల‌ర్‌ పై ఓ లుక్ వేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube