కొత్త బిజినెస్ లోకి మహేష్ బాబు .. అల్లు, దిల్ రాజు ఆగడాలకు చెక్ పెట్టేందుకే ?.

నిజమో, అబద్ధమో .సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక పాపులర్ రూమర్ ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్ని అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు చేతిలోనే ఉంటాయని అంటారు.

 Mahesh Babu Into Theater Chain Business-TeluguStop.com

చిన్న సినిమాలకి థియేటర్లు దొరక్కపోవడానికి వీరే కారణం అని దాదాపు ప్రతి చిన్న సినిమా ఫంక్షన్ జనాలు వీరిపైన దండయాత్ర చేస్తరు.మొన్నటికిమొన్న ఆర్ నారాయణమూర్తి కూడా మెగా ఫ్యామిలి, నందమూరు ఫ్యామిలి మీద చిన్న సినిమాలకి థియేటర్ల కొరత అనే టాపిక్ విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే.

ఇలాంటి వేడిలో మహేష్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, మహేష్ కలిసి తమ భాగస్వామ్యంలో ఓ పెద్ద థియేటర్ చైన్ ని మొదలుపెట్టనున్నారట.

సినిమా ఇండస్ట్రీ ప్రతి పెద్ద ఫ్యామిలి చేతిలో థియేటర్లు ఉన్నాయి.తన దగ్గర మాత్రం ఎందుకు ఉండకూడదు అనుకున్నాడేమో .ఈ ప్లాన్ వేసాడు.రెండు తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా వందలకొద్దీ కొత్త థీయేటర్లు ప్లాన్ చేస్తున్నారు.

ఎంతైనా ఒక సూపర్ స్టార్ నిర్మించే థీయేటర్లు కాబట్టి, ఇవి అధునాతన హంగులతో, టెక్నాలజితో ఉంటాయని మనం ఆశించొచ్చు.

ఈ విషయం మీద నిర్మాత సీఎన్ రావు మాట్లాడుతూ, మిగితా సినీ కుటుంబాల లాగా కాకుండా, మహేష్ చిన్న సినిమాలకి థియేటర్లు అందుబాటులో ఉంచి, ఇండస్ట్రీ బాగు కోసం పాటుపడతాడని అభిప్రాయపడ్డారు.

అంతా బానే ఉంది కాని, భవిష్యత్తులో ఎవరు ఎలా ఉంటారో మనకేం ఎరుక.మిగితా వార్తల్లోకి వెళితే, ఎప్పుడెప్పుడా అని అభిమానులని ఊరించిన మహేష్ 23 టైటిల్, ఫస్ట్ లుక్ .రెండూ రేపు (12th ఏప్రిల్) సాయంత్రం 5 గంటలకి విడుదల కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube