టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు కాగా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన పెదకాపు1( Peda Kapu-1 ) తాజాగా థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ను అందుకోలేదు.స్టార్ కాస్ట్ లేకపోవడం కూడా ఈ సినిమాకు ఒకింత మైనస్ అయిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
ఐదు సినిమాలు తీసి కారు కొనలేదు అంటే సింప్లిసిటీ అనుకోరని పిసినారితనం అనుకుంటారని నా ఫ్రెండ్ చెప్పడంతో కారును కొనుగోలు చేశానని శ్రీకాంత్ అడ్డాల కామెంట్లు చేశారు.ఇంతకాలం నా దగ్గర కారు లేదని శ్రీకాంత్ అడ్డాల అన్నారు. మహేష్ బాబు నన్ను ఇంతలా ఇష్టపడతారంటే అది ఆయన మంచితనం, గొప్పదనం అని శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala ) అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
ఆ స్టేజ్ లో ఉన్న వ్యక్తులు మనల్ని ఇష్టపడుతున్నారంటే అది మన గొప్పదనం కాదని వాళ్ల గొప్పదనం అని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చారు.మహేష్ అంటే నాకు చాలా ఇష్టమని బ్రహ్మోత్సవం రిజల్ట్ బాధపెడుతుందని ఆయన అన్నారు.అంచనాలు అందుకోకపోతే నెగిటివ్ కామెంట్లు సాధారణమని ఆయన అన్నారు.
కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతానని ఆయన చెప్పుకొచ్చారు.బ్రహ్మోత్సవం( Brahmotsavam ) ఫ్లాపైన సమయంలో ఏమైంది సార్ మనం బాగానే ఉన్నాముగా అని చెప్పారని శ్రీకాంత్ అడ్డాల పేర్కొన్నారు.
మహేష్ బాబు స్టార్ అయినా సింపుల్ గా ఉంటారని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చారు.మహేష్ బాబు ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తారని ఆయన కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ లతో సంచలనాలు సృష్టించి ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగించాలని అభిమానులు ఫీలవుతున్నారు.