తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తులు రికార్డ్ స్థాయిలో వచ్చినట్లు తెలుస్తోంది.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షా 25 వేల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
గతంలో కంటే ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది.ఈ నేపథ్యంలో ఈనెల 21వ తేదీన మద్యం దుకాణాలకు అధికారులు లక్కీ డ్రా తీయనున్నారు.
అయితే మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తులతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం భారీగా పెరిగిందని సమాచారం.ఈ క్రమంలోనే సుమారు రూ.3 వేల కోట్లు ఆదాయం వచ్చింది.రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాపారులు ఎక్కువగా ఆసక్తి చూపారు.
కాగా హైదరాబాద్ లోని సరూర్ నగర్, శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ లో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.మరోవైపు మద్యం టెండర్స్ నోటిఫికేషన్ లను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.
ఈ నేపథ్యంలో విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్లపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.