స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘లియో’.( LEO ) ఈ సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ముందు నుండి భారీ అంచనాలు పెంచేసుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.
ఇప్పటికే ఓవర్సీస్ లో ఆర్ఆర్ఆర్ ( RRR )రికార్డ్ ను బ్రేక్ చేసింది.ఆర్ఆర్ఆర్ తర్వాత ఏ సినిమా అందుకోని ఫాస్టెస్ట్ 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ అందుకుని ఒక రికార్డును ఖాతాలో వేసుకుంది.ఇక ఇప్పుడు ఏకంగా తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రికార్డును బ్రేక్ చేసి కొత్త రికార్డును నెలకొల్పినట్టు తెలుస్తుంది.సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ఏకంగా సెంచరీ నమోదు చేసినట్టు తెలుస్తుంది.
ఈ సినిమా డే 1 ఏకంగా 115 కోట్లు వసూళ్లు చేసినట్టు టాక్.ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో ఎంత వసూళ్లు రాబడుతుందా అని అంతా ఎదురు చూసారు.
మరి విజయ్ సినిమాకు అలాంటి టాక్ వచ్చిన ఫ్యాన్స్ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టారు.
ఇప్పటి వరకు కోలీవుడ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ కబాలి 105 కోట్లు, రోబో 2.0 118 కోట్లతో టాప్ లో ఉన్నాయి.మరి లియో సినిమాకు 115 కోట్లు రావడంతో రజినీకాంత్ కబాలి సినిమా రికార్డ్ ను బ్రేక్ చేసి కోలీవుడ్ లో మొదటి రోజు 100 కోట్లను కలెక్ట్ చేసిన మూవీగా రికార్డును తిరగరాసింది.
చూడాలి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో.కాగా ‘లియో’ సినిమాలో విజయ్ కు జంటగా స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తుంది.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.