కాబోయే భార్యతో వరుణ్ తేజ్... రొమాంటిక్ పిక్ షేర్ చేసిన లావణ్య త్రిపాటి!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) త్వరలోనే లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు.గత ఐదు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు వరుణ్ తేజ్ ఓ సందర్భంలో వెల్లడించారు.

 Lavanya Tripathi Shared A Romantic Pic Of Varun Tej With His Future Wife, Varun-TeluguStop.com

ఇలా ప్రేమలో విహరిస్తూ ఉన్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.ఇప్పటికే వీరిద్దరూ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఇక నిశ్చితార్థం జరుపుకున్న క్షణం నుంచి వీరు పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కానీ వీరీ పెళ్లి గురించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

Telugu Lavanya Tripati, Romantic, Shared, Varun Tej-Movie

ఇలా పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ తెలియచేయకపోయినా వీరిద్దరూ మాత్రం లవ్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.గత కొద్దిరోజుల క్రితం కాఫీ డేట్ వెళ్లిన వీరిద్దరూ తాజాగా బ్రేక్ ఫాస్ట్ డేట్ కి వెళ్లినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి బ్రేక్ ఫాస్ట్ డేట్ కి వెళ్లినట్టు వరుణ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.ఈరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ డేట్ కి వెళ్లిన వీరిద్దరూ రెస్టారెంట్ లో దిగిన ఫోటోని ఈమె షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.

Telugu Lavanya Tripati, Romantic, Shared, Varun Tej-Movie

ఇకపోతే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి వివాహం ఈ ఏడాది చివరిలో జరగబోతుంది అంటూ కూడా ఓ వార్త వైరల్ గా మారింది.వీరి వివాహం ఇటలీలో( Italy ) జరగబోతుందని కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి జరగబోతుందంటూ వార్తలు వచ్చాయి.అయితే వరుణ్ తేజ్ కూడా నిశ్చితార్థం లాగే పెళ్లి కూడా చాలా సింపుల్ గా జరగబోతుందని తెలియజేశారు.

ఇక లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నటువంటి వరుణ్ తేజ్ ముందుగా తన ప్రేమ విషయాన్ని లావణ్యకు తెలియజేశానని ఈయన తన ప్రేమ గురించి పలు విషయాలను తెలియజేశారు.ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ఈయన నటించిన గాండీవ దారి అర్జున సినిమా ఈనెల 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube