ఇది మరెక్కడి విషయంలో అనుకోకండి.మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, గుంటూరులో జరిగింది.
కరోనా తరువాత ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి.శవాల ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి.
ఏ కారణం వల్ల చనిపోయినా కూడా వారి బంధువులు శవాన్ని తీసుకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు.కరోనా మృతులతో పాటు సాదారణ మృతుల శవాలను కూడా తీసుకు వెళ్లేందుకు బంధువులు చాలా భయపడుతున్నారు.
దాంతో గుంటూరు GGHలో శవాలు ఆరు బయటే దర్శనమివ్వడం బాధాకరం.
ఇక ఈ విషయం మీద సదరు ఆసుపత్రి అధికారులతో మాట్లాడితే మార్చురీ ఫుల్ కావడంతో శవాలను భద్రపర్చడం చాలా కష్టంగా ఉందని షాకులు చెబుతున్నారు.
కాగా GGH OP వార్డు బయట ఒక శవం బయటపడగా, పొదిలి ప్రసాద్ మిలీనియం బ్లాక్ వద్ద ఒక శవం పడి ఉంది.ఆ శవాలు అక్కడ ఉండగానే అక్కడి జనాలు ఏమీ పట్టనట్టు అటు ఇటు తిరుగుతుండటం చాలా విచారకరం.
కాగా కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెంటనే ఆసుపత్రి వర్గాల వారు అప్రమత్తం అయ్యి వాటిని తీసుకువెళ్లారు.
ఈ విషయం మీడియా వరకు వెళ్లడంతో ఆసుపత్రి సుపరిడెంటెంట్ స్పందించారు.ఆయన మాట్లాడుతూ… శవాలను తీసుకు వెళ్లేందుకు వారి బంధువులు భయపడి ముందుకు రావడం లేదు, దహన సంస్కారాలకు కూడా మాకు వీలు పడటం లేదు.పరిస్థితి చాలా అద్వాన్నంగా మారింది.
గుంటూరు స్మశాన వాటికలో రోజుకు నాలుగు శవాలను దహనం చేసేందుకు మాత్రమే పరిమితి ఉంది అని అన్నారు.అలాగే ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా ఆసుపత్రి ఉన్నతాధికారులు తెలియజేశారు.