వజ్రాలను ల్యాబ్‌లో కూడా తయారుచేస్తారా..? తొలిసారి ఎక్కడంటే..?

వజ్రాలు( Diamonds ) భూమిలో లభ్యమవుతూ ఉంటాయి.దీంతో వజ్రాల కోసం తవ్వకాలు చేపడుతూ ఉంటారు.

 Lab-grown Green Diamond Special Gift That Pm Modi Gave To Us First Lady Jill Bid-TeluguStop.com

అలాగే పొలాల్లో కొన్నిచోట్ల వజ్రాలు దొరుకుతూ ఉంటాయి.దీంతో వజ్రాల కోసం చాలామంది వెతుకులాట మొదలుపెడుతూ ఉంటారు.

ఒక్కొక్కసారి జాక్ పాట్ తగిలితే వజ్రాలు దొరకవచ్చు.దీంతో రాత్రికి రాత్రి లక్షాధికారి అయిపోవచ్చు.

వజ్రాలు దొరకడంతో రాత్రికి రాత్రి లక్షాధికారి అయిపోయిన సామాన్యులు ఎంతోమంది ఉన్నారు.

Telugu Diamond, Lab Grown, Labgrown, Latest, Pm Modi, Joe Biden, Ups, Lady Jill

అయితే ల్యాబ్‌ల్లో కూడా వజ్రాలు తయారుచేయవచ్చు.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) అమెరికా పర్యటనకు వెళ్లారు.వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను( President Joe Biden ) కలిశారు.

అలాగే జిల్ బైడెన్‌ను కూడా కలిశారు.జో బైడెన్ ఆహ్వానంతో అమెరికా పర్యటనకు మోదీ వెళ్లారు.

ఈ సందర్భంగా జో బైడెన్, జిల్ బైడెన్‌ కు మోదీ అనేక కానుకలు ఇచ్చారు.రాజస్థాన్ లో తయారైన శాండిల్ వుడ్ బాక్స్, కోల్ కతాకు చెందిన ఒక కుటుంబం తయారుచేసిన గణేశుడి ప్రతిమను మోదీ బహుమతిగా అందించారు.

అలాగే దీనపు కందెను కూడా గిఫ్ట్‌గా అందించారు.

Telugu Diamond, Lab Grown, Labgrown, Latest, Pm Modi, Joe Biden, Ups, Lady Jill

అలాగే అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు( Jill Biden ) మోదీ ఒక అరుదైన కానుక ఇచ్చారు.అదేంటంటే.7.5 కారెట్ల గ్రీన్ డైమండ్‌ను( Green Diamond ) బహుమతిగా ఆమెకు మోదీ ఇచ్చారు.లాబ్ గ్రోన్ డైమాండ్‌గా దీనిని పిలుస్తారు.

ఈ డైమాండ్‌ను ల్యాబ్‌లలో కృత్రిమంగా తయారుచేశారు.వీటిని సింథటిక్ డైమండ్స్ అని కూడా పిలుస్తారట.

సహాజసిద్దంగా భూమిలో లభించే డైమండ్స్ తరహాలోనే ఇవి ఉంటాయి.సహజసిద్ద డైమండ్స్ లాగే కెమికల్, ఫిజికల్ ప్రావర్టీస్ ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్‌కు ఉంటాయి.1954లో అమెరికాకు చెందిన ఎలక్ట్రికల్ కంపెనీ న్యూయార్క్‌లోని రీసెర్చ్ లేబొలేటరీలో తొలి ల్యాబ్ గ్రోన్ డైమండ్‌ను తయారుచేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube