తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీ వేదికగా కొనసాగుతోంది.తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో నేతలు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు మళ్లీ పునర్ వైభవం రానుందని ఆ పార్టీ నేతలు గట్టిగా భావిస్తున్నారు.ఈ క్రమంలోనే మధ్యాహ్నం ఏఐసీసీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులతో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు సమావేశం కానున్నారని తెలుస్తోంది.తెలంగాణలోకి అధికారంలోకి రావడానికి కసరత్తు చేస్తున్న పార్టీ ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్నికల వ్యూహాలతో పాటు అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఈ నేపథ్యంలో విభేదాలను సైతం పక్కనపెట్టి నాయకులంతా కలిసికట్టుగా పని చేసే విధంగా అధిష్టానం మార్గనిర్దేశం చేయనుంది.అదేవిధంగా ఏకాభిప్రాయం ఉన్న నియోజకవర్గాల్లో ముందే అభ్యర్థులను ప్రకటించే అంశంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు.
కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని పార్టీ యోచిస్తోంది.