టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరోయిన్ సమంత కలిసిన నటించిన తాజా చిత్రం ఖుషి.( Khushi ) శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని సమంత అభిమానులు విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ నేపథ్యంలోనే సినిమాకు పనిచేసి అనుభవాలు తెలిపారు సినిమాటోగ్రాఫర్ జి.మురళి.
ఈ సందర్భంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నేను 2005 నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను.మొదట అందాల రాక్షసి కి పనిచేశాను.
ఆ తర్వాత నేను చేసిన లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఖుషి నే.మైత్రీ రవి ( Maitri Ravi )గారి ద్వారా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను.ఈ సినిమాకు మైత్రీ మూవీ ప్రొడ్యూసర్స్ బ్యాక్ బోన్ అని చెప్పవచ్చు.ఎందుకంటే వారికి సినిమాల మీద ఉన్నంత ప్యాషన్ నేను ఇంకో ప్రొడక్షన్ లోనూ చూడలేదు.
సినిమా బాగా వచ్చేందుకు ఏది కావాలన్నా సమకూర్చుతారు.ఫిలిం మేకింగ్ లో( film making ) వాళ్లు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు.
మైత్రీ రవి గారు ఫోన్ చేసి చెన్నైకి డైరెక్టర్ తో కలిసి వస్తున్నాము.
మీరు కథ వినండి అని చెప్పారు.అలా శివ గారు కథ చెప్పారు బాగా నచ్చింది.ఆయన ప్రీవియస్ మూవీస్ గురించి తెలుసుకున్నా.
అలాంటి మంచి డైరెక్టర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడంతో సంతోషంగా ఫీలయ్యాను.ప్రేమ గురించి కొన్ని కలలు కనే యువకుడికి లవ్, లైఫ్ అంటే మన ఊహలకు అనుగుణంగా ఉండదని తెలిసిరావడమే ఈ సినిమా నేపథ్యం.
మణిరత్నం సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ చూపించే విజువల్ బ్యూటీ ఈ చిత్రంలో చూస్తారు.అయితే అలాంటి సీన్స్ ను మేము కాపీ కొట్టలేదు.
అలాంటి ఫీల్ కలిగించేలా విజువల్స్ ఉంటాయి అని చెప్పుకొచ్చారు మురళి.