''ఖుషి'' నుండి ఎమోషనల్ సాంగ్.. పాటలతోనే హైప్ పెంచేస్తున్న మేకర్స్!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ప్రజెంట్ నటిస్తున్న మూవీల్లో ‘ఖుషి’ ఒకటి.గత రెండు సినిమాలతో విజయ్ అందుకున్న పరాభవాన్ని మరిపించేలా ఈ సినిమాతో హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

 Kushi Movie Fourth Single Yedhaki Oka Gaayam Releasing Today, Vijay Devarakonda-TeluguStop.com

లైగర్ వంటి భారీ ప్లాప్ తర్వాత విజయ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ”ఖుషి” ( Khushi ).

ఈ సినిమాలో విజయ్ కు జంటగా సమంత ( Samantha ) హీరోయిన్ గా నటిస్తుంది.విజయ్ తో పాటు సమంత ఖాతాలో కూడా ప్లాప్స్ ఉండడంతో ఈ జంట హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.శివ నిర్వాణ ద ర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లవ్ స్టోరీగా తెరకెక్కింది.

ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోగా మూడు పాటలు అయితే చార్ట్ బస్టర్ గా నిలిచాయి.ఈ సాంగ్స్ తోనే ఖుషి సినిమాపై హైప్ పీక్స్ కు చేరుకుంది.ఇక ఇప్పుడు నాల్గవ పాట రిలీజ్ కాబోతుంది.

దీంతో ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సాంగ్ సినిమాలో లవ్ పెయిన్ ను తెలిపే విషయం ఎమోషనల్ గా సాగుతుందట.

మరి ఇప్పటి వరకు అన్ని లవ్ అండ్ జోవియల్ గా సాగాయి.ఈ రోజు ఈ సాంగ్ సాయంత్రం 6 గంటల 3 నిముషాలకు రిలీజ్ అవ్వనుంది.మరి ”ఎదకు ఒక గాయం” అంటూ సాగే ఈ ఎమోషనల్ సాంగ్ ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి.ప్రజెంట్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటూనే ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.

ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube