క్రేజ్ వచ్చినట్టే వచ్చి ఇట్టే పోతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇటువంటివి సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు బాగా ఎదురవుతూ ఉంటాయి.
ఒక రెండు మూడు సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్నట్లు అందుకొని మళ్లీ డౌన్ అవుతూ ఉంటారు.దాంతో మళ్ళీ వాళ్ళు ఎత్తుకు ఎదగడానికి బాగా తిప్పలు పడుతూ ఉంటారు.
ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏ కృతి శెట్టికి( Krithi Shetty )ఎదురవుతుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక గుర్తింపు తెచ్చుకుంది కృతి శెట్టి.
తొలి చూపులతోనే తెలుగు కుర్రాళ్లను కట్టిపడేసింది.తొలిసారిగా ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయమై తొలిచూపులతోనే కుర్రాళ్ళను ఆకట్టుకుంది.
ఆ సినిమాలో బేబమ్మ పాత్రతో బాగా ఫిదా చేసింది.ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారి స్టార్ హీరోల దృష్టిలో కూడా పడింది.
హీరోయిన్ గా అడుగు పెట్టక ముందు పలు వాణిజ్య ప్రకటనలలో చేసింది.తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టగా హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.కొన్ని సినిమాలు సక్సెస్ అందించగా మరికొన్ని సినిమాలు నిరాశ కూడా పరిచాయి.మధ్యలో కొన్ని ప్రకటనలో కూడా చేసింది.కానీ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మను పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పాలి.
ఉప్పెన( Uppena ) తర్వాత అటువంటి సక్సెస్ అందుకున్న సినిమాలు మళ్ళీ ఏవి కనిపించలేవు.పైగా తనకు పోటీగా ఇప్పుడు శ్రీ లీల ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.చాలావరకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు పోటీగా శ్రీలీల( Sreeleela ( ఉందని చెప్పాలి.
దీంతో కృతి శెట్టి పరిస్థితి దారుణంగా మారింది.ఎంతలా అంటే కనీసం దర్శక నిర్మాతలు కూడా పట్టించుకోవడం లేదు తనను.
అంతగా అవకాశాలు కూడా రావట్లేవు.ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా హల్ చల్ చేస్తుంది.
ఫోటో షూట్ లంటూ తెగ సందడి చేస్తుంది.కానీ లాభం అయితే లేదని చెప్పాలి.
తను ఎంత షో చేసినా కూడా ఎవరు పట్టించుకోవటం లేదు.ఏదో ఒకటి రెండు సినిమాలు అన్నట్లు మాత్రమే అవకాశాలు అందుకుంటుంది తప్ప అవి అంత క్రేజ్ ఉన్న సినిమాలైతే కాదని చెప్పాలి.
అవకాశాలు లేకున్నా కూడా ధైర్యంగా ఉంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.
అయితే రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా కృతి శెట్టి తో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ పేర్లు జోడించి ఇందులో మీకు ఇష్టమైన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని జనాలను ప్రశ్నించారు.ఇక అందరూ మొదట శ్రీ లీల పేరుకే ఓటు వేశారు.తర్వాత మిగతా ఉన్న ఇద్దరు హీరోయిన్స్ పేరుకి ఓటు వేశారు.
ఇక కృతి శెట్టి పాపం మరీ దారుణంగా తనని చివర్లో పడేశారు.తన ఓటింగ్ శాతం పూర్తిగా తక్కువగా వచ్చిందని చెప్పాలి.
దీంతో దర్శక నిర్మాతలే కాదు జనాలు సైతం ఆమెను పట్టించుకోవటం లేదని చెప్పాలి.అయితే ఇంత తొందరగా ఆమె క్రేజ్ కోల్పోవడానికి కారణం ఏంటో తెలియదు కానీ జనాలు మాత్రం ఈమెను పట్టించుకోవడం మానేశారు అని అర్థమవుతుంది.
చెప్పాలంటే ప్రస్తుతం ఈమెకు దరిద్రం నెత్తిలో వచ్చి కూర్చుందని చెప్పాలి.