Krishna vijaya nirmala : కృష్ణ రహస్య వివాహం.. గుళ్లో పెళ్లి.. భార్య ఉండగా రెండో వివాహం ఎందుకు చేసుకున్నారు?

బంధాలు ఎప్పుడు? ఎవరితో? ఎలా మొదలవుతాయో చెప్పలేం.కృష్ణ-విజయనిర్మల పరిచయం, ప్రేమ, వివాహం కూడా అలాంటిదే.

 Krishna's Secret Marriage Reasons For Second Marriag , Super Star Krishna ,secr-TeluguStop.com

వృత్తిపరంగా కలిసిన విజయనిర్మల-కృష్ణ వ్యక్తిగతంగా దగ్గరయ్యారు.కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నారు.సినిమాల్లోకి రాకముందే కృష్ణ-ఇందిరాదేవిల వివాహం జరిగింది.1962 లో చదువు పూర్తయ్యాక కృష్ణకు వివాహం జరిపించారు.సినిమాపై మక్కువతో కృష్ణ మద్రాసు వెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఆ క్రమంలో ఆయన 1965లో విడుదలైన తేనెమనసులు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు.గూఢచారి, సాక్షి చిత్రాలు కృష్ణకు బ్రేక్ ఇచ్చాయి.అవి సూపర్ హిట్స్ కావడంతో ఆయనకు ఆఫర్స్ వెల్లువెత్తాయి.

దర్శకుడు బాపు తెరకెక్కించిన సాక్షి మూవీలో కృష్ణకు జంటగా విజయనిర్మల నటించారు.ఆ మూవీలో కృష్ణ, విజయనిర్మల కెమిస్ట్రీ వెండితెరపై పండింది.

ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగేలా చేసింది.

కృష్ణ విజయనిర్మలను రహస్య వివాహం చేసుకున్నారంటే ఆమె రియాక్షన్ ఏమై ఉంటుందంటే ఆసక్తి అందరిలో ఉంది.

విజయనిర్మల వ్యక్తిత్వం, తెలివితేటలు నచ్చిన కృష్ణ ఒకరోజు గుడిలో రహస్య వివాహం చేసుకున్నారు.

విజయనిర్మలకు కూడా అది రెండో వివాహం.నరేష్ మొదటి భర్తకు కలిగిన సంతానం.

ఆమెకు మొదటి భర్తతో విబేధాలు ఉన్నాయి.ఇక ఈ రహస్య వివాహాన్ని మొదటి భార్య ఇందిరా వద్ద కృష్ణ దాచలేదు.

విజయనిర్మలను పెళ్లి చేసుకున్నట్లు చెప్పేశారట.ఆ మాట విన్న ఇందిరా దేవి మౌనంగా ఉండిపోయారట.

ఏం మాట్లాడకుండా తన అంగీకారం తెలిపారట.ఇందిరాదేవిలోని మరో గొప్ప విషయం విజయనిర్మలను అంగీకరించడం.

కృష్ణ నటి విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్నా ఆమె అంగీకరించారు.మొదట్లో దీనిపై చాలా బాధపడిన ఆమె.ఆ తర్వాత భర్త నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తేల్చి చెప్పేశారని తెలిసింది.భర్తతో విభేదించకుండా కలిసి ఉన్నారు.

దీంతో కృష్ణ ఇద్దరు భార్యలతోనూ కలిసి ఉండేవారట.

కృష్ణ అభిప్రాయాలను, ఇష్టాలను గౌరవిస్తూ గొప్ప సతీమణిగా నిరూపించుకున్నారు.కృష్ణ అభిప్రాయాలను, ఇష్టాలను గౌరవిస్తూ గొప్ప సతీమణిగా నిరూపించుకున్నారు.ఏళ్ల తరబడి ఇందిరా దేవి అజ్ఞాతంలో ఉంది పోయారు.

ఆమె నేమ్ ఫేమ్ కోరుకోలేదు.భార్యగా, తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూ… లోప్రొఫైల్ మైంటైన్ చేశారు.

కృష్ణ భార్య పేరు చెప్పమంటే టక్కున విజయనిర్మల అని చెప్పేవారే ఎక్కువ.మొదటి భార్య ఇందిరా దేవి గురించి తెలిసినవాళ్ళు చాలా తక్కువ.

రెండో వివాహం చేసుకున్నప్పటికీ తన భర్తగా కూడా కొనసాగాలని ఇందిరా దేవి కోరుకున్నారట .ఆ విధంగా కృష్ణ విజయనిర్మల, ఇందిరా దేవిలతో సాన్నిహిత్యం కొనసాగించారు.ఇక ఇందిరాదేవి-కృష్ణలకు ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు తో పాటు పద్మజ, మంజుల, ప్రియదర్శి అనే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.విజయనిర్మలతో కృష్ణ పిల్లల్ని కనలేదు.నరేష్ విజయనిర్మలతో మొదటి భర్తకు పుట్టిన సంతానం.

ఇక ఇందిరా దేవి దశాబ్దాల పాటు కెమెరా వెనుకుండిపోయారు.ఆమె ఎలాంటి పబ్లిక్ వేడుకల్లో పాల్గొనేవారు కాదు.

ఇంటికే పరిమితమయ్యేవారు.ఇందిరా దేవి కావాలనే లో ప్రొఫైల్ మైంటైన్ చేసేవాళ్ళు.

అయితే ఇందిరా దేవి, విజయ నిర్మళా ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే.ఇందిరా దేవి ఈ ఏడాది సెప్టెంబర్ 28 బుధవారం రోజు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.అటు విజయనిర్మల కూడా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదారాబాదు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2019, జూన్ 27 గురువారం ఉదయం మరణించారు.

Superstar Krishna Second Marriage Rumors

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube