లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో చిరంజీవి - రామ్ చరణ్ మల్టీస్టారర్ ఫిక్స్..?

అభిమానులను ఎల్లపుడూ కాలర్ ఎగరేసుకునేలా చేసే హీరోల లిస్ట్ తీస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) పేరు నెంబర్ 1 స్థానం లో ఉంటుంది.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన చిరంజీవి, ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ మెగాస్టార్ అయ్యాడు.

 Kollywood Director Lokesh Kanagaraj To Direct Chiranjeevi Ram Charan Multi Starr-TeluguStop.com

ఒకప్పుడు ఆయన క్రేజ్ ఎలా ఉండేది అంటే , టాలీవుడ్ లో మొదటి స్థానం నుండి చివరి స్థానం వరకు మొత్తం మెగాస్టార్ చిరంజీవే అని ట్రేడ్ పండితులు సైతం ముక్త కంఠం తో ఒప్పుకున్నా లాగ ఉండేవి.కానీ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్ళాడో , పదేళ్ల పాటు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాడు.అప్పుడు ఆయనకీ గ్రిప్ పోయిందని అందరు అనుకున్నారు , కానీ ‘ఖైదీ నెంబర్ 150 ‘( Khaidi No.150 ) చిత్రం తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి వంద కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన మొట్టమొదటి నాన్ రాజమౌళి హీరో గా చరిత్ర సృష్టించాడు.

Telugu Acharya, Bhola Shankar, Chiranjeevi, Disasters, Kollywoodlokesh, Fans, Ra

ఇక ఆ తర్వాత ఆయన వరుసగా 5 సినిమాలు చేస్తే అందులో రెండు వంద కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన సినిమాలు ఉండగా మూడు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.వాటిల్లో ‘ఆచార్య’ ( Acharya )మరియు రీసెంట్ గా విడుదలైన ‘భోళా శంకర్’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలుగా నిలిచాయి.ఆచార్య చిత్రమే పెద్ద ఫ్లాప్ అనుకుంటే, ఈ భోళా శంకర్( Bhola Shankar ) చిత్రం ఇంకా పెద్ద ఫ్లాప్ అయ్యింది.ఫుల్ రన్ లో ఈ చిత్రం కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టే ఛాన్స్ లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 27 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.ఇది రెండు దశాబ్దాల క్రితం వచ్చిన చిరంజీవి సినిమాల క్లోసింగ్ కలెక్షన్స్ తో సమానం.

ఇది నిజంగా మెగాస్టార్ కి ఘోరమైన అవమానం అనే చెప్పాలి.

Telugu Acharya, Bhola Shankar, Chiranjeevi, Disasters, Kollywoodlokesh, Fans, Ra

ఇప్పుడు మెగా ఫ్యాన్స్( Mega Fans ) కి అర్జెంటు గా మెగాస్టార్ చిరంజీవి నుండి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి, అందుకే చిరంజీవి తన తదుపరి చిత్రం ఏమిటి అనే దానిపై అభిమానులు అనేక విధాలుగా ఆరాలు తీస్తున్నారు.కొంతమంది ‘భింబిసారా’ డైరెక్టర్ వసిష్ఠ తో ఒక సినిమా చేయబోతున్నాడని, ఆ చిత్రం నవంబర్ నెల నుండి ప్రారంభం కాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.మరికొంత మంది అయితే ఏ ఆర్ మురగదాస్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

ఈ రెండు కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) తో కలిసి చిరంజీవి ఒక సినిమా చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో రామ్ చరణ్ కూడా ఉంటాడట.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆగస్టు 22 వ తారీఖున తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube