ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే తెలుగులో ఒకప్పుడు పలువురు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మెప్పించినటువంటి కుష్బూ ఇంట్లో కరోనా వైరస్ విషాద ఛాయలు అలముకున్నాయి.
దాంతో తాజాగా కరోనా వైరస్ బారినపడి ఖుష్బూ దగ్గర బంధువు అయినటువంటి ఓ వ్యక్తి మృతి చెందినట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా మృతి చెందిన వ్యక్తి ఖుష్బూకి దగ్గరి చుట్టం అవడంతో అతడి ఇంట్లోని కుటుంబ సభ్యులకు మరియు పనిచేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు కూడా సమాచారం.
అయితే కరోనా వైరస్ కారణంగా మృతి చెందినటువంటి ఆ వ్యక్తి నటి ఖుష్బూ కి ఏమవుతాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.కాగా ఈ రోజు ఉదయం ఈ కరోనా వైరస్ బారినపడి బాలీవుడ్ ప్రముఖ సింగర్ వాజీద్ ఖాన్ మృతి చెందాడు.
కాగా తెలుగులో నటి కుష్బూ ఈ మధ్య కాలంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి అజ్ఞాతవాసి అనే చిత్రంలో పవన్ కళ్యాణ్ కి తల్లి పాత్రలో నటించింది.అయితే ఆ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఆ తర్వాత మళ్లీ కుష్బూ తెలుగులో ఇప్పటివరకూ నటించలేదు.