మిడతల పై యుద్ధానికి సిద్ధమైన చైనా డక్ ఆర్మీ...

అదేంటోగాని ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ చైనా దేశంలోనే అన్ని వింతలు మరియు విపత్తులు పుట్టుకొస్తున్నాయి.ఇప్పటికే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కరోనా వైరస్ కారణంగా అల్లాడుతుంటే దేశంలో తిండి గింజలు పండించేటువంటి రైతులను ప్రస్తుతం మిడతలు పట్టి పీడిస్తున్నాయి.

 Locust War, China, Duck Army, Corona Virus,-TeluguStop.com

దీంతో కొంత మంది రైతులు తమ పంట పొలాలను రక్షించుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

దీంతో తాజాగా కొందరు అగ్రికల్చర్ సైంటిస్టులు మిడతల సమస్యకు సమాధానం కనుక్కునే పనిలో పడ్డారు.

ఇందులో భాగంగా బాతుల సహాయంతో మిడతలకు చెక్ పెట్టొచ్చని ప్రయోగాత్మకంగా కనుగొన్నారు.అనుకున్నదే తడవుగా లక్షల సంఖ్యలో బాతులను రైతులు పెంచడం ప్రారంభించారు.అంతేగాక ఈ బాతులకి డక్ ఆర్మీ అంటూ పేరు కూడా పెట్టారు.దీంతో ప్రస్తుతం చైనా దేశంలో బాతుల పెంపకానికి బాగా డిమాండ్ పెరిగింది.

దీంతో కొంతమంది డబ్బున్నవాళ్ళు  బాతులు పెంపక వ్యాపారంపై ట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట.అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు.ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్ ను అడ్డుకుండెనుకు ఉపయోగించే శానిటైజర్లు మరియు మాస్కులు వంటివి అమ్మడం ద్వారా కొందరు కోట్లు గడించినట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ చైనీయులు మాత్రం విపత్తులను సైతం ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకుంటారని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే కొందరు ప్రకృతి నిపుణులు మాత్రం చైనాలో గతంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లు కారణంగానే ప్రస్తుతం మిడతల సమస్య ఎదుర్కొంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇందులో ముఖ్యంగా అప్పట్లో పిచ్చుకలు, ఎకలులు వంటి వాటిని నాశనం చేసేందుకు చైనా దేశం ప్రయోగాలు నిర్వహించిందని వాటివల్ల మిడతలను మరియు పలు చెడు కీటకాలను  భక్షించే పిచ్చుకలు వంటి పక్షుల జాతులు అంతరించి పోయాయని అందువల్లనే చైనీయులుకి ఈ మిడతల కష్టాలని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube