రాధే శ్యాం, ఆర్.ఆర్.
ఆర్ తర్వాత అంతే భారీ అంచనాలతో రాబోతున్న క్రేజీ మూవీ కె.జి.ఎఫ్ చాప్టర్ 2.ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పార్ట్ 1 సెన్సేషన్స్ క్రియేట్ చేయగా రాబోతున్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి.ప్రశాంత్ నీల్, యశ్ కలిసి ఈ సెకండ్ పార్ట్ తో మరో అద్భుతాన్ని చేయాలని చూస్తున్నారు.పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ని మరింత భారీగా చేస్తున్నారు.
ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేసిన కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.సినిమా సెన్సార్ సభ్యుల నుండి మంచి టాక్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.
సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికెట్ ఇచ్చారు.
అంతేకాదు సినిమా రన్ టైం కూడా రివీల్ అయ్యింది.
కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పార్ట్ 1 లానే 2:48 గంటల రన్ టైం తో వస్తుంది.ప్రశాంత్ నీల్ తన టాలెంట్ మొత్తం ఈ సినిమాలో చూపించాడని తెలుస్తుంది.
ఆల్రెడీ టీజర్ తో సంచలనం సృష్టించగా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు.ఈ సీక్వల్ పై నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ ఉంది.
మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.యశ్, శ్రీనిది శెట్టి జంటగా నటించిన కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పై తెలుగులో కూడా భారీ క్రేజ్ ఉంది.