ముంబైలో రెండో రోజు సమావేశమైన విపక్షాల ఇండియా కూటమి కీలక తీర్మానాలు చేసింది.ఈ మేరకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని ఇండియా కూటమి తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.
రాబోయే లోక్ సభ ఎన్నికలలో వీలైనంత వరకు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.వివిధ రాష్ట్రాల్లో సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లు తక్షణమే ప్రారంభించాలని, వీలైనంత త్వరగా సీట్ల పంపకాలు జరుపుకోవాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా ప్రాముఖ్యత కలిగిన ప్రజా సమస్యలపై బహిరంగ సభలు, ర్యాలీలకు వెళ్లాలని ఇండియా కూటమి తీర్మానించింది.
మరోవైపు మొత్తం 13 మందితో ఇండియా కూటమి సమన్వయ కమిటీ ఏర్పాటైంది.
కేసీ వేణుగోపాల్, శరద్ పవార్, ఎంకే స్టాలిన్, సంజయ్ రౌత్, తేజస్వీ యాదవ్, రాఘవ్ చద్దా, అభిషేక్ సహా పలువురు నేతలు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.అయితే ఇవాళ జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కన్వీనర్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.