Sulthan Karthi : కార్తి, రష్మిక మందాన్న నటించిన మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ “సుల్తాన్‌” నవంబరు 27 ఈ ఆదివారం మీ జీ తెలుగులో

హైదరాబాద్‌, నవంబరు 24, 2022 – జీ తెలుగు అంటేనే నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌.అద్భుతమైన సీరియల్స్‌, ఆకట్టుకునే కార్యక్రమాలతో తెలుగు లోగిళ్లలో వినోదాన్ని అందిస్తోంది.

 Karthi & Rashmika Mandanna Starrer Masala Entertainer, Sulthan - This Sunday, 27-TeluguStop.com

అంతేకాకుండా సూపర్‌హిట్‌ సినిమాల్ని వారాంతంలో ప్రసారం చేస్తోంది.ఇదే కోవలో ఈ వారం కార్తి, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన సుల్తాన్‌ సినిమాను వరల్డ్ టెలివిజన్‌ ప్రీమియర్‌గా జీ తెలుగు ప్రసారం చేస్తోంది.

‘అందమే అతివై వస్తే’ లాంటి సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఉన్న సుల్తాన్‌ సినిమా… ఈ ఆదివారం అంటే నవంబరు 27, 2022 సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగులో ప్రసారం కానుంది.సుల్తాన్‌ సినిమా కథ విషయానికి వస్తే… విక్రమ్‌ (కార్తి) ముంబయిలో చదువుకుని తన సొంత ఊరు విశాఖపట్నం వస్తాడు.

విక్రమ్‌ తండ్రి దగ్గర వందమంది రౌడీలు ఆశ్రయం పొందుతుంటారు.తన బిడ్డ విక్రమ్‌లాగే రౌడీల్ని కూడా సమానంగా చూసుకుంటాడు విక్రమ్‌ తండ్రి.

అయితే అనుకోని పరిస్థితుల్లో విక్రమ్‌ తండ్రి చనిపోతాడు.ఈ సమయంలో అదే ప్రాంతానికి వచ్చిన పోలీస్‌ అధికారి… ఈ వందమంది రౌడీల్ని టార్గెట్‌ చేస్తాడు.

దీంతో… వాళ్లలో మార్పు తీసుకువస్తానని పోలీస్ అధికారికి ప్రామిస్‌ చేస్తాడు విక్రమ్‌.మరి విక్రమ్‌.

పోలీస్‌ అఫీసర్‌కు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడా.? రష్మిక ఎలా పరిచయం అయ్యింది.

వందమంది రౌడీలతో కలిసి విక్రమ్‌ వేరే ఊరు ఎందుకు వెళ్లాల్సింది.తెలుసుకోవాలంటే ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారం అయ్యే సుల్తాన్‌ సినిమాను మిస్‌ అవ్వకుండా చూడాల్సిందే కార్తి హీరోగా నటించిన ఈ సినిమాలో నేషనల్‌ క్రష్‌ రష్మి హీరోయిన్‌గా నటించింది.

రామచంద్ర రాజు మరో ప్రధాన పాత్రల నటించారు.భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకుడు.అద్భుతమైన యాక్షన్‌ డ్రామా సుల్తాన్‌ సినిమాను అస్సలు మిస్‌ కాకండి.ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సుల్తాన్‌ మూవీ మీ జీ తెలుగులో….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube