పోలీసులే దొంగలయ్యారుగా... వీడియో వైరల్..

కొన్ని సినిమాలలో సమాజంలో పోలీసులే అన్యాయం చేస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు.మరికొన్ని సినిమాలలో నిజాయితీగల పోలీస్ ఆఫీసర్లు ఎలా ఉంటారో చూపిస్తూ ఉంటారు.

 Kanpur Police Theft From A Sleeping Man On Footpath Details, Kanpur Police, Poli-TeluguStop.com

కొన్ని,సినిమాలలో పోలీసులకు కంప్లైంట్ చేసిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెబుతారు.కానీ,ప్రస్తుత సమాజంలో ఏ చిన్న వస్తువు దొంగలించిన, ఏ చిన్న గొడవ జరిగినా ప్రతి ఒక్కరూ వెళ్లి పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు.

ఎందుకంటే పోలీసులు తమ వస్తువుని తిరిగి తెస్తారని ప్రజలలో ఉన్న నమ్మకం.కానీ, దొంగల బారీనుంచి ప్రజలను రక్షించాల్సిన పోలీసులే దొంగతనానికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లో జరిగింది.

రాత్రివేళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నఇద్దరు పోలీసులు పక్కన మంచం పై నిద్రపోతూ ఉన్నా ఓ వ్యక్తిని చూసి ఆగి ఆ వ్యక్తి నిద్రపోతున్నట్లు గమనించి దొంగతనం చేశారు.

ఆ తరువాత ఒక పోలీసు ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి, ప్రశాంతంగా నిద్రపోతున్న వ్యక్తి మంచం పై ఉన్న ఫోన్‌ తీసుకున్నాడు.

ఆ తర్వాత ఏమీ జరగనట్టు దాన్ని చూసుకుంటూ వెళ్లి పోయినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డ్ అవడం వల్ల పోలీసుల దొంగతనం బయటపడింది.

ఈ వీడియోను ఓ వ్యక్తి ట్వీట్టర్‌లో షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన వారందరూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు దొంగతనాలు చేయడం ఏంటి అని మండిపడుతున్నారు.ఇలాంటి వారిని పోలీస్ శాఖ లో కొనసాగించకూడదని కూడా కామెంట్లు చేస్తున్నారు.ఇలాంటి వారిని వెంటనే విధుల నుంచి తొలగించి ఇలాంటి వారిపై తగిన చర్య తీసుకోవాలని మరి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.

మరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ పోలీస్ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube