రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే ప్రతి భాషలో అద్భుతమైన హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా కర్ణాటకలో మాత్రం ఈ సినిమా పరిస్థితి కాస్త తారుమారుగా ఉంది.
ఇక ఈ సినిమా పై ఎంతో మంది సెలబ్రెటీలు స్పందిస్తూ ప్రశంసలు కురిపించగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మాత్రం ఈ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ వర్సెస్ జేమ్స్ అంటూ రెండు సినిమాల మధ్య తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన నటించిన చివరి చిత్రం జేమ్స్ విడుదల అయిన సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా కర్ణాటకలో అత్యధిక థియేటర్లలో రన్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇలా ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతూ ఉండగానే ఏకంగా 270 థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా పునీత్ సినిమాని తొలగించారు.

ఇలా సినిమా అద్భుతమైన టాక్ తో నడుస్తున్నప్పటికీఆర్ఆర్ఆర్ సినిమా కోసం తమ అభిమాన నటుడు పునీత్ సినిమా తొలగించడం పట్ల కన్నడ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోని పునీత్ సోదరుడు శివ రాజ్ కుమార్ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా కన్నడ ఫిల్మ్ ఛాంబర్‌ని ఆయన ఈ విషయంపై ప్రశ్నించినట్టు తెలుస్తుంది.తప్పు ఎవరిది అనే విషయం పక్కన పెడితే ఎంతో మంచి కలెక్షన్లతో థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమాని ఎలా తొలగిస్తారు అంటూ ఫిలిం ఛాంబర్ పెద్దలపై శివరాజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.