దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా విడుదలైతే హీరోల గత సినిమాల రికార్డులు బ్రేక్ అవుతుంటాయి.ఆర్ఆర్ఆర్ సినిమా తొలిరోజు కలెక్షన్లు 125 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.
కనీసం 800 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు ఆర్ఆర్ఆర్ ఖాతాలో చేరితే మాత్రమే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ రిజల్ట్ ను అందుకుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ ఎంట్రీతో బాహుబలి2 క్రియేట్ చేసిన రికార్డులలో మెజారిటీ రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశం అయితే ఉంది.ఈ విషయంలో తారక్, చరణ్ అభిమానులు ఒకవైపు ఉంటే ప్రభాస్ అభిమానులు మరోవైపు నిలుస్తున్నారు.బాహుబలి2 సినిమాను ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేసే అవకాశమే లేదని కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.అయితే తారక్, చరణ్ అభిమానులు మాత్రం ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని చెబుతున్నారు.
ఎంత పెద్ద సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసినా భవిష్యత్తులో ఏదో ఒకరోజు రికార్డులు బ్రేక్ కాక తప్పదు.జక్కన్న ఇప్పటివరకు తన సినిమాలతో తన రికార్డులను బ్రేక్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.2009 సంవత్సరంలో రాజమౌళి 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో మగధీర సినిమాను తెరకెక్కించి 90 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

12 ఏళ్ల తర్వాత రాజమౌళి మగధీర బడ్జెట్ కు పది రెట్లు ఎక్కువ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించే స్థాయికి ఎదిగారు.సినిమాలకు ఏ విధంగా ప్రమోషన్స్ చేయాలో జక్కన్నకు తెలిసిన విధంగా మరో టాలీవుడ్ డైరెక్టర్ కు తెలియదనే చెప్పాలి.ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో దర్శకుడిగా జక్కన్న స్థాయి మరింత పెరిగిందని చెప్పాలి.సినిమాసినిమాకు రాజమౌళికి సక్సెస్ రేట్ తో పాటు రెమ్యునరేషన్ కూడా పెరుగుతోంది.







