టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని సినీ అభిమానులకు శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.శంకర్ తన డైరెక్షన్ స్కిల్స్ తో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.
శంకర్ కమల్ కాంబోలో తెరకెక్కిన భారతీయుడు మూవీ అప్పట్లో సంచలనాలను సృష్టించింది.ఈ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా( Indian 2 ) తెరకెక్కగా ఈ సినిమా గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే గ్లింప్స్ చూసిన ప్రేక్షకులు కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.సేనాపతి పాత్ర( Senapati Role ) వయస్సు లెక్క విషయంలో తేడా జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భారతీయుడు సినిమాలో కమల్ పాత్ర( Kamal Haasan ) వయస్సు 70 సంవత్సరాలు అని ఇండియన్ 2 సినిమాలో లెక్క ప్రకారం కమల్ పాత్ర వయస్సు 97 సంవత్సరాలు అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఈ కామెంట్ల విషయంలో శంకర్( Director Shankar ) ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.అయితే లాజిక్స్ ను పట్టించుకోకుండా చూస్తే మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.భారతీయుడు2 సినిమా కోసం కమల్ హాసన్ ఎంతో కష్టపడ్డారు.కమల్ హాసన్ వయస్సు ప్రస్తుతం 69 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో కూడా ఆయన కష్టపడుతున్న తీరుకు నెటిజన్లు ఫీలవుతున్నారు.
కమల్ హాసన్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లు కమల్ రేంజ్ ను మరింత పెంచడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.కమల్ హాసన్ భారీ రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.కమల్ హాసన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఇండియన్2 సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుంది.