మాతృ భాషను మరవకండి.. హిందీ భాష పై స్పందించిన కమల్ హాసన్!

లోకనాయకుడు లెజెండ్రీ నటుడు కమల్ హాసన్ తమిళ భాష వర్ధిల్లాలి అంటూ పిలుపునిచ్చారు.కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విక్రమ్.

 Kamal Haasan Controversial Comments Vikram Audio Launch Event , Kamal Haasan , V-TeluguStop.com

ఈ సినిమాని ఈయన తన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించారు.విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో నటిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా జూన్ మూడవ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ఈవెంట్ కార్యక్రమంలో భాగంగా కమల్ హాసన్ భాష గురించి ప్రస్తావించారు.ఈ క్రమంలోనే తమిళ భాష వర్ధిల్లాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు.ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ తాను హిందీ భాషకి ఎప్పుడు వ్యతిరేకిని కాదని అలాగని తమిళ భాషకు అడ్డుపడితే ఆ పరిణామాలను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Telugu Controversial, Hindi Language, Kamal Haasan, Kollywood, Mother Toung, Tam

చిన్నతనం నుంచి తనకు నటుడు శివాజీ గణేషన్ అలాగే గీతరచయిత వాలి వీరే తన గురువులని, ప్రస్తుతం తాను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అంటే అందుకు కారణం వీరిద్దరేనని కమల్ హాసన్ వెల్లడించారు.తమిళం వర్ధిల్లాలి అని చెప్పడం నా బాధ్యత మాతృభాషను ఎవరు మర్చిపోకూడదు అలాగని హిందీ భాషకు తాను వ్యతిరేకం కాదని అన్ని భాషలు ఒకటే, అన్ని భాషలు కలిస్తేనే ఇండియా అంటూ ఈ సందర్భంగా కమల్ హాసన్ హిందీ భాష గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube