క్రేజీ హీరో తో నటించనున్న కాజల్ అగర్వాల్....

తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు అందరు ప్రముఖ హీరోలతో నటించిన టువంటి టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి చెప్పనవసరం లేదు.అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఈమె టైం అసలు బాగాలేదు నట్లు కనిపిస్తోంది.

 Kajal Agarwal Dulquer Salman Kamala Haasan-TeluguStop.com

ఎందుకంటే ఇప్పటికే ఈమె నటించిన టువంటి ఎమ్మెల్యే, కవచం, సీత, రణరంగం, వంటి చిత్రాలు డిజాస్టర్ గా నిలిచి ప్రస్తుతం ఈమె తెలుగు సినీ పరిశ్రమలో గడ్డుకాలం ఎదుర్కొంటుంది.అయితే సినిమాలు వరుస డిజాస్టర్ లో అవుతున్న అవకాశాలు మాత్రం కాజల్ తలుపు తాడుతున్నాయి.

దీంతో ఈ అమ్మడు వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.

అయితే తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తమిళ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది.

అయితే ఈ చిత్ర విశేషాలను తన అభిమానులతో పంచుకునేందుకు నిరాకరించింది కాజల్.అంతేగాక తొందర్లోనే ఈ చిత్రం గురించి పలు విషయాలను వెల్లడిస్తానని చెబుతోంది ఈ అమ్మడు.

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం విలక్షణ నటుడు కమల హాసన్ నటిస్తున్న టువంటి భారతీయుడు 2 చిత్రంలో విభిన్నమైన ఇటువంటి పాత్ర చేస్తోంది కాజల్.ఈ చిత్రంలో కమల్ సరసన 85 ఏళ్లు కలిగినటువంటి  వృద్ధురాలు పాత్రలో కాజల్ నటిస్తోంది.

Telugu Kajal Aggarwal, Kajalaggarwal-Movie

అయితే ఇది ఇలా ఉండగా ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన కాజల్ ఇప్పుడు ఏ హీరో అయినా సరే అవకాశం ఇస్తే చాలు అనే స్థాయికి చేరింది.అందుకుగాను ఆమె వయసు ఓ కారణం కాగా సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్లకు హవా పెరగడంతో కాజల్ ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube