ప్రియుడు కోసం ఏకంగా పేరు మార్చుకున్న గుప్పెడంత మనసు నటి.. తానే హింట్ ఇచ్చేసిందిగా?

స్టార్ మాలో ప్రసారమవుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ ఏలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.ఈ సీరియల్ జగతి( Jagathi ) పాత్ర ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

 Guppedantha Manasu Actress Changed Her Name For Her Boyfriend, Jagathi, Jyothi-TeluguStop.com

జగతి పాత్రలో నటించిన జ్యోతి రాయ్ ( Jyothi Rai ) చూడటానికి ఎంతో సాంప్రదాయపద్ధంగా కట్టుబొట్టు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.సీరియల్ లో ఎంతో హుందాగా కనిపించే జ్యోతి రాయ్ అలియాస్ జగతి వ్యక్తిగత జీవితంలో మాత్రం పలు విమర్శలను ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చి ఒక యంగ్ డైరెక్టర్ ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

బెంగళూరుకి చెందిన జ్యోతి 20 సంవత్సరాల వయసులోని వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నారు.అయితే కొన్ని కారణాలవల్ల ఈమె తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ సుఖ పూర్వజ్ ( Sukh Purvaj )అనే వ్యక్తికి దగ్గరయ్యారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ ఎంతో చనువుగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారా అన్న సందేహాలు వ్యక్తం చేశారు.

ఇకపోతే తాజాగా ఈమె ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు.ఈ క్రమంలోని ట్విట్టర్లో ఈమె జ్యోతి పూర్వజ్ ( Jyothi Purvaj ) అనే పేరు మీదగా తన ట్విట్టర్ ఖాతాని ఓపెన్ చేశారు.

ఇలా తన పేరు పక్కన డైరెక్టర్ పేరు పెట్టుకోవడంతో ఈమె ఆయనని పెళ్లి చేసుకున్నారా అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి సాధారణంగా పెళ్లి చేసుకున్న తర్వాతే భర్త పేరును తమ పేరు పక్కన చేర్చుకుంటారు.ఈ క్రమంలోనే నటి జ్యోతి రాయ్ సైతం పూర్వజ్ పేరును పక్కన చేర్చుకోవడంతో తాను డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్నానని ఇలా పరోక్షంగా హింట్ ఇచ్చారా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా ఎంతో పద్ధతిగా కనిపించే జగతి ఇలా భర్తకు విడాకులు ఇచ్చి మరొక కుర్ర డైరెక్టర్ తో రిలేషన్ లో ఉండి తనని పెళ్లి చేసుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube