నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తారక్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా తారక్ సైమా అవార్డ్స్- 2023 ( Saima Awards- 2023 )ఉత్తమ హీరోగా అవార్డును అందుకున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ఈ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు.
ఈ నామినేషన్ లిస్ట్‌లో రామ్ చరణ్ ఉన్నా అవార్డు మాత్రం కొమురం భీం పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్‌కే దక్కింది.
2016లో జనతా గ్యారేజ్ ( Janata Garage )చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆయన మొదటిసారి ఈ అవార్డును అందకున్నారు.ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు.కొమురం భీముడో… కొమురం భీముడో పాటలో ఆయన అభినయం ప్రేక్షకుల చేత నిజంగానే కన్నీళ్లు పెట్టించింది.
ఇలా మొత్తంగా ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు మెచ్చకోని ప్రేక్షకుడు లేడు అనడంలో అతిశయోక్తి కాదు.
తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని భాషాల్లో కూడా ఆడియన్స్ ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు.
బీభత్సం, రౌద్రం, ప్రేమ, కరుణ ఒకే పాత్రలో చూపించి దేశం మొత్తం తనవైపు తిప్పుకున్నాడు.అంతేకాకుండా ఎన్టీఆర్ లో ఎన్నో గొప్ప గొప్ప లక్షణాలు టాలెంట్లు కూడా ఉన్నాయి.ఆ వివరాల్లోకి వెళితే.
ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం నిన్ను చూడాలని.ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ ( Remuneration of Rs.3.5 lakhs )తీసుకున్నారని టాక్.ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు హీరోగా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్.కాగా తారక్ దాదాపుగా 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు.తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల ప్రేక్షకులను ఆకర్షించారు.ఇది ఎన్టీఆర్ కు ఎనిమిది భాషలు వచ్చు.8 భాషల్లో మాట్లాడగలడు అన్న విషయం అభిమానులకు కూడా చాలా మందికి తెలియదు.