ఎన్టీఆర్ రాకతో 'బింబిసార' నెక్స్ట్ లెవల్ కు వెళ్లిందా?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ సినిమా బింబిసార.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

 Jr Ntr Superb Entry Bimbisara Pre Release Event Details, Bimbisara Grand Pre-rel-TeluguStop.com

యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్త మీనన్, క్యాథరిన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.ఆగష్టు 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసింది.

అయితే కళ్యాణ్ రామ్ ఒక్కడితో ఇది మరింత హైప్ తెచ్చుకోవడం కష్టమే.దీంతో ఈ సినిమా కోసం తన తమ్ముడు ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాడు కళ్యాణ్ రామ్.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ విచ్చేసిన విషయం విదితమే.హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జులై 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగగా.

Telugu Bimbisara, Bimbisaragrand, Bimbisara Pre, Jr Ntr, Ntr, Kalyan Ram, Nandam

ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వచ్చి బింబిసార టీమ్ ను మరింత ఉత్సాహ పరిచాడు తారక్.ఒకే వేదికపైకి నందమూరి అన్నదమ్ములు కనిపించి నందమూరి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేసారు.

ఈ వేడుకకు తారక్ విచ్చేసి ఈ టీమ్ కు మరింత బూస్ట్ ఇవ్వడంతో ఈ సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్ళింది.తారక్ చాలా రోజుల తర్వాత బయట కనిపించడంతో మరింత క్రేజ్ వచ్చేసింది.

దీంతో ఇప్పుడు అంతా కూడా బింబిసార గురించి మాట్లాడు కుంటున్నారు.తారక్ రాకతో బింబిసార సినిమాకు ఫుల్ మైలేజ్ వచ్చిందనే చెప్పాలి.

చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube