ఏప్రిల్ 28న విజయవాడలో ఎన్టీఆర్( N.T.Rama Rao ) శత జయంతి ఉత్సవం ఏర్పాటుచేశారు.టీడీపీ భారీ సభతో పాటుగా ఎన్టీఆర్ కు ఘన నివాళి అందించనున్నారు.అయితే ఈ కార్యక్రమానికి తమిళ స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఇన్విటేషన్ అందింది.28న రజినీకాంత్ కూడా విజయవాడ వస్తున్నారని తెలుస్తుంది.ఇక తండ్రి శత జయంతి ఉత్సవాల్లో బాలకృష్ణ( Balakrishna ) కూడా పాల్గొననున్నారు.టీడీపీ అధినేత చంద్ర బాబు మిగతా కార్యకర్తలతో ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని చూస్తుంది.
ఈ ప్రోగ్రాం కు జూనియర్ ఎన్.టి.ఆర్ కు ఆహ్వానం అందలేదని టాక్.పెద్దాయన శత జయంతి ఉస్తవాల్లో తారక్ పాల్గొనే ఛాన్స్ లేదని తెలుస్తుంది.
అయితే ఎన్.టి.ఆర్ ప్రస్తుతం కొరటాల శివ( Koratala Siva ) సినిమా బిజీలో ఉండటం వల్ల ఆ ప్రోగ్రాం కు అటెండ్ అవలేకపోతున్నాడని తెలుస్తుంది.అంతేకాదు ఎన్టీఆర్ శత జయంతి వేడుక అంటూ రిలీజ్ చేసిన పోస్టర్స్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో వేయలేదు.
తారక్( Jr NTR ) రావడం కుదరదు కాబట్టే ఆ పోస్టర్ లో అతన్ను ఉంచలేదని టాక్.ఏది ఏమైనా ఎన్టీఆర్ శత జయంతి ఉస్తవాల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొంటే బాగుండేదని ఫ్యాన్స్ అంటున్నారు.