ప్రస్తుతం కర్నాటక ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది.ఈ ఎన్నికల తరువాత మరో ఐదు నెలల్లో తెలంగాణలో మోడ్ మొదలు కానుంది.
దీంతో బీజేపీ తెలంగాణపై( BJP ) ఇప్పటి నుంచే గట్టిగా ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది.ఎప్పటినుంచో సౌత్ రాష్ట్రాలలో పాగా వేయాలని చూస్తున్న కాషాయ పార్టీ ప్రస్తుతం కర్నాటకలో మాత్రమే అధికారంలో ఉంది.
ఆ రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికలతో అధికారాన్ని నిలబెట్టుకోగలదా అంటే చెప్పడం కష్టమే.దాంతో రానున్న తెలంగాణ ఎన్నికలు బీజేపీకి ఎంతో కీలకంగా మారాయి.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడుతూ వస్తోంది.

ఇతర పార్టీల నేతలు కమలం పార్టీపై బాగానే ఆకర్షితులౌతున్నారు.అటు ప్రజల్లో కూడా బీజేపీకి ఆదరణ పెరిగింది.దాంతో ఈసారి మిస్ అయితే ఇక ఎప్పటికీ గెలుపు కష్టమే అని భావిస్తున్న కాషాయ దళం ఎలాగైనా తెలంగాణ ఎన్నికల్లో సత్తాచాటి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేసుకుంటూ దూసుకుపోతున్నారు రాష్ట్ర కమలనాథులు.ముఖ్యంగా పబ్లిసిటీపై ఎక్కువ ఫోకస్ పెట్టె దిశగా కాషాయపార్టీ అడుగులు వేస్తోందట.” తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం ” అనే ట్యాగ్ లైన్ తో ముందుకు వెళ్లాలని కమలనాథులు భావిస్తున్నారట.

గోడలపై, ఫ్లెక్సీలపై ఇదే నినాదాన్ని మేజర్ హైలెట్ చేయబోతున్నారట.కేసిఆర్ ( CM KCR )సర్కార్ పై విమర్శలు గుప్పించడం సాధారణం.అదే విధంగా పార్టీకి ప్రజల్లో మైలేజ్ రావాలంటే పదునైన నినాదాలు కూడా ఎంతో అవసరం.
ఏపీలో గత ఎన్నికల ముందు రావాలి జగన్.కావాలి జగన్ అనే నినాదం వైసీపీకి ఏ స్థాయిలో ప్లేస్ అయిందో అందరికీ తెలిసిందే.
అదే విధంగా తెలంగాణలో ” బంగారు తెలంగాణ కేసిఆర్ తోనే సాధ్యం ” అనే నినాదం కూడా బిఆర్‌ఎస్( BRS party ) కు మంచిగానే ప్లేస్ అయింది.

ఇప్పుడు బీజేపీ కూడా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ” తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం ” అంటూ హైలెట్ చేస్తోంది.కర్నాటక ఎన్నికలు పూర్తి కాగానే.ఇక పూర్తి స్థాయిలో జాతీయ, రాష్ట్రీయ బీజేపీ నేతలు ఇదే నినాదంతో తెలంగాణపై గట్టిగా ఫోకస్ పెట్టబోతున్నారట.
మరి బీజేపీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.







