జో బైడెన్‌కు స్కిన్ క్యాన్సర్?

జో బైడెన్‌ ఎవరో చెప్పనవసరం లేదు.జో బైడెన్‌ పూర్తిపేరు ‘జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్.’ బైడెన్ 2009 నుండి 2017 వరకు అమెరికా 47వ ఉపాధ్యక్షునిగా పనిచేసి 2020 ఎన్నికలలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు డెమొక్రాటిక్ పార్టీ తరుపు నుండి విజయం సాధించి ఏకంగా అమెరికా 46వ అద్యక్ష్యుడిగా నియమితులయ్యారు.ఈ క్రమంలో 2020 యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించడం జరిగింది.బైడెన్ పై ఓ రికార్డు వుంది.1972 లో తన మొదటి ఎన్నిక తరువాత బైడెన్ 1978, 1984, 1990, 1996, 2002, 2008లలో వరుసగా 6 సార్లు సెనేట్ పదవికి ఎన్నికయ్యారు.

 Joe Biden Had Cancerous Skin Lesion Removed,joe Biden,skin Cancer,white House,us-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళితే, జో బైడెన్‌కు స్కిన్ క్యాన్సర్‌ సోకిందని కొన్నాళ్లుగా మనం వింటున్న విషయమే.అయితే దీనికి చికిత్స చేసి దాన్ని తొలిగించినట్లు వైట్‌హౌజ్‌ వైద్యులు తాజాగా తెలిపారు.అంతే కాకుండా క్యాన్సర్‌ నుంచి ఆయన పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు కూడా వెల్లడించారు.ఆమధ్య జో బైడెన్‌ స్వయంగా ఒక ప్రెస్‌మీట్‌లో తనకు క్యాన్సర్‌ ఉందని చెప్పడంతో ఈ అంశం సోషల్ మీడియాలో హాట్‌ న్యూస్ అయింది.

అందువలన వైట్‌హౌజ్‌ రంగంలోకి దిగి ఆయనకి సంబంధించినటువంటి విషయంలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.ఇకపోతే బైడన్ గత ఏడాది అంటే సరిగ్గా పదవీ బాధ్యతలు చేపట్టానికి ముందు… ఆయనకు ఉన్న స్కిన్‌ క్యాన్సర్‌ గురించి ప్రస్తావించినట్లు వైట్‌ హౌజ్‌ వెల్లడించింది.ఏడాది కాలంగా ఆయన క్యాన్సర్‌ సోకిందనే విషయంపై జరుగుతున్న చర్చకు వైట్‌హౌజ్‌ వైద్యులు అసలు విషయాన్ని తాజాగా వెల్లడించడం గమనార్హం.బైడెన్‌కు ఛాతి వద్ద క్యాన్సర్‌ సోకిందని, దాన్ని చికిత్స చేసి తొలిగించామని తెలిపారు.

ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube