సోలో ట్రావెలింగ్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!

ఒంటరిగా ప్రయాణించడం వల్ల వ్యక్తిగతంగా ఎదుగుతారనేది అక్షర సత్యం.ఒంటరిగా ప్రయాణించడం వల్ల అన్ని విషయాలు తెలుస్తాయి.

 Mistakes You Should Never Make While Travelling Solo,solo Travelling, Travelling-TeluguStop.com

అలాగే సొసైటీలో ప్రజలు ఎలా ఉన్నారనేది కూడా తెలుస్తుంది.ఇతరులను తెలుసుకోవడంతోపాటు సెల్ఫ్ డిస్కవరీ కూడా సాధ్యమవుతుంది.

అయినప్పటికీ సోలో ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.ముఖ్యంగా ఐదు కామెంట్ మిస్టేక్స్ అసలు చేయకూడదు.

అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓవర్‌ప్యాక్ చేయవద్దు

:

Telugu Solo, Solo Trip, Tips-Latest News - Telugu

సోలోగా వెళ్లేటప్పుడు మన లగేజీ అంతా మనమే మోయాలి.దీనివల్ల అధిక లగేజ్ తీసుకెళ్లడం పెద్ద పొరపాటు అవుతుంది.అందుకే లైట్‌ మాత్రమే ప్యాక్ చేయాలి.

ఫలానా వస్తువు తప్పక తీసుకెళ్లాలి అనుకుంటేనే తీసుకెళ్లాలి.లేదంటే దాన్ని తీసుకెళ్లి ఇబ్బంది పడక తప్పదు.

ఓవర్‌ షెడ్యూలింగ్‌ వద్దు

:

Telugu Solo, Solo Trip, Tips-Latest News - Telugu

చాలా ప్రదేశాలను కవర్ చేయడానికి ఉరుకులు పరుగులు తీయాల్సిన అవసరమే లేదు.ట్రావెలింగ్ అనేది ప్రతిదీ చాలా నెమ్మదిగా పూర్తిగా ఆస్వాదించే ఒక అనుభూతి.కాబట్టి ఒక సమయంలో ఒకే డెస్టినేషన్ కి వెళ్లేలా ట్రిప్పు ప్లాన్ చేసుకోవాలి.అక్కడ వారం రోజులు గడిపితే.మధురమైన ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్ మీకు కచ్చితంగా లభిస్తుంది.

ఎల్లప్పుడూ ప్లాన్ బి ఉండాలి

:

ట్రావెలింగ్ ప్లాన్ చేయడం మన చేతుల్లో ఉంటుంది కానీ అది ఎలా పూర్తవుతుందనేది మన కంట్రోల్లో ఉండదు.ముందుగా అనుకున్నట్లు ట్రావెలింగ్ ప్లాన్ కొనసాగకపోతే ఏం చేయాలో జర్నీ ప్రారంభించక ముందే ప్లాన్ చేసుకోవాలి.తద్వారా ఇబ్బందులు ఎదురు కావు.

ప్రయాణ ఖర్చులపై స్పెషల్ కేర్

:

Telugu Solo, Solo Trip, Tips-Latest News - Telugu

ఈ రోజుల్లో అన్ని ఛార్జీలు పెరిగిపోయాయి.రూమ్ తీసుకోవాలన్నా, టిఫిన్/మీల్స్ చేయాలన్నా భారీగా ఖర్చు చేయక తప్పడం లేదు.ఇలాంటి సమయంలో సోలో ట్రిప్‌ ప్లాన్ చేయడం అంటే చాలా డబ్బులతో కూడుకున్న పని.అలానే ముందుగా అంచనా వేసిన ట్రిప్ ఎక్స్‌పెన్సెస్ తర్వాత పెరగొచ్చు.అందువల్ల ఎల్లప్పుడూ ఎక్స్‌ట్రా డబ్బును బ్యాకప్‌గా ఉంచుకోవడం మంచిది.

ఒంటరితనాన్ని ఆహ్వానించండి

:

Telugu Solo, Solo Trip, Tips-Latest News - Telugu

ఒంటరి ప్రయాణం చేసేటప్పుడు మనతో మాట్లాడడానికి ఎవరూ ఉండరు.అయితే ఇతరులతో మాట్లాడితే ట్రావెలింగ్ చేసినట్లే అనిపించదు.కానీ ట్రావెలింగ్ చేసేటప్పుడు మీకంటూ సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube