ఎన్‌ఆర్ఓ (NRO) అకౌంట్ అనేది ప్రవాస భారతీయులు (NRIలు) భారతదేశంలో సంపాదించిన డబ్బును స్టోర్ చేయడానికి లేదా ఎన్నారై కావడానికి ముందు వాడే బ్యాంకు అకౌంట్.ఇందులో అద్దె, జీతం, డివిడెండ్‌లు వంటి ఆదాయాలు డిపాజిట్ చేయవచ్చు.
ఈ అకౌంట్‌పై వచ్చే వడ్డీపై ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను వసూలు చేస్తుంది ప్రభుత్వం.మీరు నాన్ రెసిడెంట్ అయిన వెంటనే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను NRO ఖాతాగా మార్చడం చాలా ముఖ్యం.
NRO ఖాతాలు భారతీయ కరెన్సీలో నిర్వహించడం జరుగుతుంది.ఈ అకౌంట్స్ విదేశీ కరెన్సీకి మార్చబడవు.సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలతో పోలిస్తే దీనిలో డిపాజిట్ చేసే రూపాయి ఆదాయంపై కస్టమర్లు అధిక వడ్డీ మొత్తాన్ని, రాబడిని పొందవచ్చు.NRO ఖాతాలోని నిధులను ఏదైనా చెల్లింపు కోసం ఉపయోగించవచ్చు.
ఖాతాను భారతీయ బంధువులు లేదా భారత పౌరులతో జాయింట్‌గా మేనేజ్ చేయవచ్చు.NRO ఖాతా కోసం బ్యాంకును ఎంచుకున్నప్పుడు, వడ్డీ రేట్లను సరిపోల్చడం, అన్ని నిబంధనలు, షరతులు చదవడం ముఖ్యం.
ప్రతి బ్యాంక్ వేర్వేరు వడ్డీ రేటును కలిగి ఉంటుంది.కొన్ని ఇతర వాటి కంటే మెరుగైన ఇంట్రెస్ట్ రేట్స్ ను ఇప్పుడు అందిస్తున్నాయి.
వాటిపై ఓ లుక్కేద్దాం.అంతకుముందు ఈ రేట్స్ చాలా లేటెస్ట్‌వి అని గమనించాలి.
• హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ సమయం వరకు 7.10%
• యాక్సిస్ బ్యాంక్: 2 సంవత్సరాల నుంచి <30 నెలలకు 7.26%
• ఫెడరల్ బ్యాంక్: 18 నెలల నుంచి రెండు సంవత్సరాలకు 7.25%
• UCO బ్యాంక్: 666 రోజులకు 7.15%
• సిటీ యూనియన్ బ్యాంక్: 444 రోజులకి 7.75%
• కాథలిక్ సిరియన్: 750 రోజులకు 7.50%
• ధనలక్ష్మి బ్యాంక్: 555 రోజులకు 7.25%
• పంజాబ్ సింధ్ బ్యాంక్: 222 రోజులకు 8.00%
• యూనియన్ బ్యాంక్: 800 రోజులు & 3 సంవత్సరాలకు 7.30%
• స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 400 రోజులకు 7.10%
• DCB బ్యాంక్: 15 నెలల నుంచి 18 నెలల వరకు 7.85%
• బంధన్ బ్యాంక్: 600 రోజులకు 8.00%
.