ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ( Zelensky ) హఠాత్తుగా బ్రిటన్ పర్యటనకు వెళ్లడంతో సర్వత్రా ఉత్కంఠకు తెరలేపింది.రష్యా – యుక్రెయిన్ ( Russia – Ukraine )యుద్ధం నిరాటంకంగా జరుగుతున్న తరుణంలో జెలెన్ స్కీ విదేశీ పర్యటనలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి.
అక్కడికి చేరుకున్న జెలెన్ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్( Rishi Sunak ) తో భేటీ కానున్నారు.ఈ సందర్భంగా జెలెన్ స్కీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… రిషి సునాక్ తో భేటీ షురూ కానున్నట్టు తెలిపారు.
ఇక అందరూ అనుమాన పడ్డట్టుగానే తన సైన్యం, వాయుసేన సామర్థ్యాలను పెంచుకునే విషయంలో యూకే పాత్ర అమోఘం అని ఈ సందర్భంగా రాసుకొచ్చారు.
దీని బట్టి యూకే( UK ) సహకారం కూడా వారికే ఉన్నట్టు సుస్పష్టం అవుతోంది.మరోవైపు జెలెన్ స్కీ పర్యటనపై రిషి సునాక్ కూడా ప్రతి స్పందించారు.ఉక్రెయిన్ ను తాము వదిలేయబోమని ఆయన ఈ సందర్భంగా అతని మాటలకు మద్దతు తెలిపారు.
ఉక్రెయిన్ – రష్యా యుద్ధానికి సంబంధించి ఇది కీలక సమయమని చెప్పారు.ఇప్పుడు యుద్ధ క్షేత్రం ఉక్రెయిన్ భూభాగం లోపల ఉన్నప్పటికీ దాని ప్రభావం మాత్రం ప్రపంచమంతా ఉందని అన్నారు.
పుతిన్ కు ప్రతిఫలం దక్కకుండా చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా వారు చెప్పడం ఇపుడు పెను దుమారాన్ని సృష్టిస్తోంది.ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ కు దీర్ఘశ్రేణి క్షిపణులను సరఫరా చేసేందుకు యూకే సిద్ధపడింది.ఈ మేరకు గత గురువారం బ్రిటన్ ( Britain )నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది.ఈ వార్తలు వెలువడిన తరువాత రష్యా సానుభూతిపరుల గుండెల్లో గుబులు మొదలైంది.
రోజుల వ్యవధిలోనే ముగిసిపోతుందనుకున్న యుద్ధం యుక్రెయిన్ సంవత్సరాల పాటు కొనసాగించడం ఇపుడు చాలామందికి అర్ధం కాకుండా పోతుంది.