ప్రతీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఆడియెన్స్ ను బాగా అలరిస్తూ ఉంటాయి.అందుకే ఆ కాంబోస్ అంటే ప్రేక్షకులు మరింత ఎగ్జైట్మెంట్ గా ఉంటారు.
మన టాలీవుడ్ లో కూడా ఇలాంటి సూపర్ హిట్ కాంబోలు చాలానే ఉన్నాయి.ఈ కాంబోల్లో సినిమాలు వస్తున్నాయి అంటే ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ కు చేరుకుంటాయి.
మరి కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి బ్లాక్ బస్టర్ క్రేజీ కాంబినేషన్స్ ఉన్నాయి.వాటిల్లో ఇళయ దళపతి విజయ్ (Thalapathy Vijay) అండ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee Kumar) కాంబో ఒకటి.
ఈ కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి.మరి ఈ సాలిడ్ కాంబో మరోసారి కూడా ఉంటుంది అని వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు మరో క్రేజీ కాంబో కోలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది.స్టార్ డైరెక్టర్ అట్లీ మొదటిసారిగా కోలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ స్టార్ హీరోతో జత కట్టబోతున్నారని టాక్.ఆ హీరో ఎవరంటే అజిత్ కుమార్ (Ajith Kumar).
అట్లీ, అజిత్ కాంబో ఈసారి ఖచ్చితంగా ఉంటుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి.ప్రస్తుతం అజిత్ తన 62వ సినిమాను చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత 63వ సినిమాగా అట్లీ – అజిత్ కాంబో ఉంటుంది అని టాక్.మరి ఈ సెన్సేషనల్ కాంబో నిజంగానే ఉంటుందో లేదో ముందు ముందు తెలియాల్సి ఉంది.అట్లీ కూడా ప్రజెంట్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఇప్పటికే షూట్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది.