ఆంధ్రా ఆక్టోపస్ అంచనా ఎందుకు తప్పిపోయింది?

తమిళనాడులో అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయ్యాయి.చివరకు ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు పొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజ్ గోపాల్ సర్వే కూడా అబద్ధమైంది.

 Jayalalithaa Remains Chief Minister-TeluguStop.com

దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అమ్మ జయలలిత ఓడిపోతుందని, అయ్య కరుణానిధి కుర్చీలో కూర్చుంటారని అంచనా వేశాయి.కానీ తమిళ ప్రజలు మళ్ళీ అమ్మ మీదనే భక్తి చాటుకున్నారు.

ఆమె అక్రమాస్తుల కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నప్పటికీ ఆమెనే గెలిపించారు.ఆమె కంటే ముందు కరుణానిధి ఎన్నికల వాగ్దానాలు చేశారు.

ప్రణాళిక విడుదల చేశారు.ప్రధానంగా రైతులకు రుణ మాఫీ వాగ్దానం చేసినా ప్రజలు పట్టించుకోలేదు.

అమ్మ ఓడిపోతుందని మీడియా ఎగ్జిట్ పోల్స్ చెప్పగానే జయలలిత అప్సెట్ అయిపోయారు.

ఎవ్వరికీ అందుబాటులో ఉండకుండా అజ్ఞాతంలో ఉన్నారు.

ఇప్పుడు ఆమె ముఖంలో విజయగర్వం కనబడుతోంది.ఈ రాష్ట్రంలో ఒకే పార్టీ రెండోసారి అధికారం కట్టబెట్టడం గత 32 ఏళ్ళలో ఇదే మొదటిసారి.93 ఏళ్ళ వయసులో ముఖ్యమంత్రి పీఠం ఎక్కి రికార్డు సృష్టించాలని అనుకున్న కరుణానిధి కల నెరవేరకుండా పోయింది.ఇక అది నెరవేరదు కూడా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube