ఈ మధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారిని సైతం మోసం చేయడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు.కాగా ఇటీవలే ఓ మహిళ తన భర్త ఆర్మీలో ఉద్యోగం చేస్తుండడంతో వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకొని బిడ్డకు జన్మనివ్వడంతో మహిళ భర్త తనకు విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే ఓ వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి కేరళ రాష్ట్రంలోని “తిరువనంతపురం” పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.కాగా వివాహిత భర్త సతీషన్ (పేరు మార్చాం) ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఉద్యోగ కారణాల వల్ల పెళ్లైన 22 రోజుల వ్యవధిలోనే ఉద్యోగం నిమిత్తమై ఇల్లు విడిచి పెట్టి వెళ్ళాడు.ఆ తర్వాత దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు.
అయితే తను ఇంటికి వచ్చే పాటికి తన భార్య మగ బిడ్డకు జన్మనివ్వడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు.అంతే కాకుండా తన పెళ్లయిన తర్వాత తాను ఒక్కసారి కూడా తన భార్యతో శారీరకంగా కలవలేదని అలాగే తనకు ఫెర్టిలిటీ సమస్య కూడా ఉందని దాంతో వైద్యులు సూచించిన మందులను వాడుతున్నట్లు తెలిపాడు.
దీంతో వెంటనే సతీషన్ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించి ఈ విషయంపై క్షుణ్ణంగా విచారించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.అంతేకాకుండా తన భార్యకి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని కాబట్టి తన బిడ్డ కి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని కూడా కోరాడు.
దీంతో ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు సతీష్ భార్యకి జన్మించిన బిడ్డకి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.