బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో రెండో వారం ఎలిమినేట్ అయిన ఉమాదేవి వరుస ఇంటర్వ్యూస్ తో బిజీ బిజీగా ఉన్నారు.సీరియల్స్ లో గయ్యాలి అత్త పాత్రలతో అలరిస్తున్న ఉమాదేవి బిగ్ బాస్ హౌజ్ లో కూడా అదే విధంగా ఉన్నారని చెప్పొచ్చు.
ఇక ఆమె లాస్ట్ వీక్ నామినేషన్స్ టైం లో నోరు జారి బూతు మాట్లాడటం ఆమెను హౌజ్ నుండి బయటకు వచ్చేలా చేసింది.బిగ్ బాస్ ఎక్స్ పీరియన్స్ గురించి చెబుతున్న ఉమాదేవి బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ అని అంటారు కాని అది నిజంగానే రియాలిటీ షో అని క్లారిటీ ఇచ్చారు.
బిగ్ బాస్ షో స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుందని చాలామంది అంటుంటారు.ఉమాదేవి మాత్రం షో ఏమాత్రం స్క్రిప్ట్ కాదు.
నిజమైన గేం షో అని చెప్పింది.
ఇక రెండో వారమే తను ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం తనకు అలవాటని.కాని అదే తనని బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చేలా చేసిందని అన్నారు.
ఛాన్స్ వస్తే మళ్లీ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేందుకు సిద్ధమే అని అన్నారు ఉమాదేవి.లాస్ట్ వీక్ నటరాజ్ మాస్టర్, ఉమాదేవిల మధ్య చివర్లో టఫ్ ఫైట్ జరిగి ఫైనల్ గా నటరాజ్ మాస్టర్ సేఫ్ అయ్యి ఉమాదేవి హౌజ్ నుండి బయటకు వచ్చింది.