మంచు మోహన్‌బాబు ఏం చేసినా చాలా ప్రత్యేకంగా ఉంటుంది.ఆయన చేసే ప్రతి పని కూడా చాలా డిసిప్లెన్‌గా ఉంటుంది.
మోహన్‌బాబు తాజాగా ఒక వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.నిన్న జరిగిన జనతా కర్ఫ్యూ సందర్బంగా మోహన్‌బాబు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు.
అదే సమయంలో మోహన్‌బాబు తన భార్యకు సేవ చేస్తూ కనిపించాడు.ఎప్పుడు కష్టపడుతూ ఉండే ఆడవారికి ఇలా సేవ చేయాలంటూ ఆయన చెప్పకనే చెప్పాడు.
భార్యకు తన తండ్రి చేస్తున్న సేవను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో అయినా వారికి సేవ చేయాలని సూచించాడు.
ఆడవారు ప్రతి రోజు ఇంట్లో ఎన్నో పనులు చేస్తూ ఉంటారు.ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లో ఉండటం వల్ల వారికి సాయం చేయాలంటూ మంచు మనోజ్ సూచించాడు.

దీంతో పాటు మగవారు ఏ పనులు అయితే చేస్తున్నారో వారు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని అన్నాడు.కరోనాను ఇంట్లోనే ఉండి ఎదుర్కోవాలని, బయటకు వెళ్లి కరోనా తెచ్చుకోవడం కంటే ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి కరోనాకు దూరంగా ఉండాలి.ఇదే సమయంలో ఇంట్లో అమ్మ లేదా ఆవిడకు సేవ చేయాలంటూ మంచు హీరో పిలుపునిచ్చాడు.మరి ఈ పిలుపును ఎంత మంది పట్టించుకుంటారో చూడాలి.
—