అయోధ్యలో ఉగ్రదాడుల కుట్ర ని... చేధించిన నిఘా వర్గాలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఇక దీనిపై ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చిన కూడా, రివ్యూ పిటీషన్ వేసిన కూడా సుప్రీం కోర్టు వాటిని పరిగణంలోకి తీసుకోలేదు.

 Jaish E Mohammad Planning Terror Attack In Ayodhya-TeluguStop.com

మరోవైపు ఉగ్రవాద మూకలని దేశంలోకి రానీయకుండా బీజేపీ ప్రభుత్వం నిఘా వ్యవస్థని, భద్రతని పటిష్టం చేశారు.ఈ నేపధ్యంలో ఒకప్పుడు ఇండియా మధ్యలో జరిగే ఉగ్రదాదులు గత ఆరేళ్ళ కాలంలో భాగా తగ్గిపోయాయి.

అయితే కొన్ని సంస్థలు దేశీయ ఉగ్రవాదాన్ని ఎలా అయిన రెచ్చగొట్టి ఇండియాలో ఉగ్రదాదులు జరిగేలా చేసి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలనే ప్లాన్ చేస్తున్నారు.అయితే ఇలాంటి వాటికి నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ వస్తున్నాయి.

తాజాగా అయోధ్యలో ఉగ్ర దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ సిద్ధమైనట్లు భారత నిఘా వర్గాలు పసి గట్టాయి.జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్ భారత్ లో తమ స్లీపర్ సేల్స్ ని యాక్టివ్ చేస్తూ టెలిగ్రామ్ చాటింగ్ యాప్ లో పంపించిన సందేశాన్ని నిఘావర్గాలు గుర్తించాయి.

మౌలానా మసూద్ అజార్ పంపించిన ఆ సందేశాన్ని డీకోడ్ చేసిన ఇంటెలీజెన్స్ అయోధ్యలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్రపన్నుతున్నట్టు నిర్ధారించుకున్నారు.ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖతోపాటు అన్ని భద్రతా బలగాల విభాగాలకు తెలియజేసి అప్రమత్తంగా చేసాయి.

ఈ నేపధ్యంలో హోం శాఖ అయోధ్యలో భద్రతని మారిత పటిష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube