సిబిఐ మాజీ జేడీ, జై భారత్ పార్టీ( Jai Bharat Party ) అధినేత జెడి లక్ష్మీనారాయణ( JD Lakshmi Narayana ) వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.మొన్నటి వరకు విశాఖ ఎంపీగా పోటీ చేసే ఆలోచనతో ఉంటూ వచ్చిన జేడి ఇప్పుడు మనసు మార్చుకుని ఎమ్మెల్యే గానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు గత కొంతకాలంగా ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం పై( Vizag North Constituency ) ఎక్కువ ఫోకస్ పెట్టారు .అక్కడి నుంచే పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు .ఎక్కువగా ఉత్తర నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం, మేధావి వర్గం తనక మద్దతుగా నిలుస్తుందని జేడి అంచనా వేస్తున్నారు.
దీనికి తగ్గట్లుగానే విశాఖ ఎంపీగా గతంలో పోటీ చేసిన లక్ష్మీనారాయణకు ఉత్తర నియోజకవర్గం నుంచి ఎక్కువ ఓట్లు నమోదు కావడం, ఆ ఓటు బ్యాంకు అలాగే ఉండడంతో ఈ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా ( MLA ) పోటీ చేస్తే .తన గెలుపు ఖాయం అనే అంచనాతో జేడీ ఉన్నారు.ఉత్తర నియోజకవర్గంలో 2.87 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ,టిడిపి అభ్యర్థులు గెలుపొందారు.ఈ నియోజకవర్గంలో వైసిపి బలహీనంగా ఉంది.నియోజకవర్గాల పునర్వైభజన తరువాత 2009లో ఏర్పడిన ఉత్తర నియోజకవర్గం నుంచి తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి విజయ్ కుమార్ గెలుపొందారు.
2014లో బిజెపి అభ్యర్థి పెనుమత్స విష్ణుకుమార్ రాజు సాధించారు.2019లో టిడిపి అభ్యర్థి గంటా శ్రీనివాస్( Ganta Srinivas ) గెలిచారు.గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి పరాజయం చెందారు.
ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి అధికార పార్టీ వైసీపీ నుంచి కేకే రాజు ఎన్నికల బరిలో ఉన్నారు. టిడిపి , జనసేన, బిజెపి కూటమి అభ్యర్థిగా బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు.
ఇప్పుడు జేడీ కూడా అక్కడి నుంచే పోటీ చేయబోతూ ఉండడం తో ఈ నియోజకవర్గం పై అందరి దృష్టి పడింది.