JD Lakshmi Narayana : ఎమ్మెల్యేగా జేడి పోటీ .. ఏ నియోజకవర్గం అంటే ?
TeluguStop.com
సిబిఐ మాజీ జేడీ, జై భారత్ పార్టీ( Jai Bharat Party ) అధినేత జెడి లక్ష్మీనారాయణ( JD Lakshmi Narayana ) వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
మొన్నటి వరకు విశాఖ ఎంపీగా పోటీ చేసే ఆలోచనతో ఉంటూ వచ్చిన జేడి ఇప్పుడు మనసు మార్చుకుని ఎమ్మెల్యే గానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు గత కొంతకాలంగా ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం పై( Vizag North Constituency ) ఎక్కువ ఫోకస్ పెట్టారు .
అక్కడి నుంచే పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు .ఎక్కువగా ఉత్తర నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం, మేధావి వర్గం తనక మద్దతుగా నిలుస్తుందని జేడి అంచనా వేస్తున్నారు.
"""/" /
దీనికి తగ్గట్లుగానే విశాఖ ఎంపీగా గతంలో పోటీ చేసిన లక్ష్మీనారాయణకు ఉత్తర నియోజకవర్గం నుంచి ఎక్కువ ఓట్లు నమోదు కావడం, ఆ ఓటు బ్యాంకు అలాగే ఉండడంతో ఈ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా ( MLA ) పోటీ చేస్తే .
తన గెలుపు ఖాయం అనే అంచనాతో జేడీ ఉన్నారు.ఉత్తర నియోజకవర్గంలో 2.
87 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ,టిడిపి అభ్యర్థులు గెలుపొందారు.
ఈ నియోజకవర్గంలో వైసిపి బలహీనంగా ఉంది.నియోజకవర్గాల పునర్వైభజన తరువాత 2009లో ఏర్పడిన ఉత్తర నియోజకవర్గం నుంచి తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి విజయ్ కుమార్ గెలుపొందారు.
"""/" /
2014లో బిజెపి అభ్యర్థి పెనుమత్స విష్ణుకుమార్ రాజు సాధించారు.2019లో టిడిపి అభ్యర్థి గంటా శ్రీనివాస్( Ganta Srinivas ) గెలిచారు.
గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి పరాజయం చెందారు.ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి అధికార పార్టీ వైసీపీ నుంచి కేకే రాజు ఎన్నికల బరిలో ఉన్నారు.
టిడిపి , జనసేన, బిజెపి కూటమి అభ్యర్థిగా బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు.
ఇప్పుడు జేడీ కూడా అక్కడి నుంచే పోటీ చేయబోతూ ఉండడం తో ఈ నియోజకవర్గం పై అందరి దృష్టి పడింది.
వీడియో: మెరుపు వేగంతో ఢీ కొట్టిన కారు.. గాల్లో ఎగిరిపోయిన స్టూడెంట్..