మోడీతో కలవనున్న ముఖ్యమంత్రి జగన్! చర్చించే అంశాలు ఇవే

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిపాలనా బాద్యతలు చేపట్టిన తర్వాత రెండో సారి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు.దీనికి సంబంధించి ఇప్పటికే అతనికి అపాయింట్ మెంట్ దొరకడంతో ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

 Jagan Will Be Meet Pm Modi And Amith Shah-TeluguStop.com

ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే మధ్యాహ్నం జగన్ ఢిల్లీ ప్రయాణం అవుతారు.సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని జగన్ ప్రత్యేకంగా కలవనున్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటు చేయడానికి గల కారణాలని, అలాగే మండలి రద్దు గురించి తెలియజేయనున్నట్లు తెలుస్తుంది.పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రధాని మోదీని జగన్ కోరబోతున్నట్లు చెబుతున్నారు.

అలాగే ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విజభన హామీల అమలుతో పాటు, రైల్వే జోన్ అభివృద్ధికి కావాల్సిన నిధుల గురించి అడిగే అవకాశమున్నట్లు తెలుస్తుంది.కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై కూడా జగన్ మోడీకి వివరిస్తారని చెప్పుకుంటున్నారు.

మోడీతో సమావేశం తర్వాత హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ అవుతారని.వారితో కూడా ఏపీకి రావాల్సిన నిధుల గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది.

అయితే ఈ పర్యటనలో జగన్ కేవలం తన రాజకేయ లబ్ది కోసం, జనసేన పార్టీని బీజేపీతో కటీఫ్ చెప్పించి తాను జత కడతానని చెప్పడానికి మోడీ, అమిత్ షాని కలవనున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఇప్పటి వరకు ఏపీకి రావాల్సిన నిధుల గురించి జగన్ కేంద్రాన్ని గట్టిగా అడిగింది లేదని, అలాంటిది ఇప్పుడు ఎలా అడిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

మరి ఈ విషయంలో వాస్తవాలు ఏంటి అనేది జగన్ మీడియాతో చెప్పేంత వరకు గోప్యంగానే ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube