దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.దేశ వ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి.
దీంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవులు ఇవ్వటం మాత్రమేకాక ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాయి.కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నాయి.
అయినా గాని సామాన్యులతో పాటు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు.
ఈరోజు చంద్రబాబుకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
స్వల్ప లక్షణాలతో చంద్రబాబు కరోనా బారిన పడటం జరిగింది.ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కి కరోనా సోకడంతో పై.ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు.చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆరోగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.ఇక ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి కాస్త వెటకారంగా రియాక్ట్ అయ్యారు.యాదృచ్ఛికమే అయినా ఎన్టీఆర్ వర్ధంతి నాడు చంద్రబాబు కి కరోనా సోకడం బాధాకరమని పేర్కొన్నారు.చంద్రబాబు కి కరోనా వచ్చిన తగ్గిపోతుందిలే గాని.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆయన పొడిచిన వెన్నుపోటు మాత్రం… తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుండిపోతుంది అంటూ వెటకారంగా కామెంట్లు చేశారు.