విజయ సాయిరెడ్డి ప్రాధాన్యం పెంచిన జగన్ ! 

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రాధాన్యం జగన్ బాగా పెంచారు.మొదట్లో వైసీపీలో కీలక బాధ్యతలను విజయసాయిరెడ్డి నిర్వర్తించే వారు.

 Jagan Handed Over Key Responsibilities To Vijayasai Reddy , Vijay Sai Reddy , Ut-TeluguStop.com

ఆ తర్వాత ఆ స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు.ప్రస్తుతం వైసీపీ కి సంబంధించిన ఏ విషయం పైన అయినా విజయసాయి రెడ్డి స్పందిస్తున్నారు.

ఎవరు జగన్ ను కలవాలన్న,  ఆయన అనుమతితోనే వెళ్లాల్సిన పరిస్థితి.దీంతో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం జగన్ వద్ద తగ్గిపోయిందని,  ఆయనను జగన్ పక్కన పెట్టేశారు అనే ప్రచారం చాలాకాలంగా వైసీపీలోనే నెలకొంది.

అయితే జగన్ మాత్రం విజయసాయి రెడ్డికి ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ బాధ్యతలతో పాటు,  వైసీపీ అనుబంధ విభాగాల ఇంచార్జీ గానూ జగన్ ఆయనను నియమించారు.దీని ద్వారా వైసీపీ లోని విజయసాయి వ్యతిరేక వర్గానికి జగన్ చెక్ పెట్టినట్టయింది.
 

వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు విజయసాయి కొత్త పదవికి సంబంధించి ఆదేశాలు వెలువడ్డాయి.వైసీపీకి చెందిన యువత , విద్యార్థి ,మహిళా విభాగాలకు మాత్రమే కాకుండా , సోషల్ మీడియా వింగ్ కూడా విజయసాయిరెడ్డి ఇన్చార్జిగా వ్యవహరించ బోతున్నారు.ప్రస్తుతం అనేక రకాల ఇబ్బందులతో జగన్ ఉన్నారు.ప్రభుత్వపరంగా ఎంతగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న,  ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండడం,  అలాగే పార్టీలోనూ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం,  ఇవన్నీ జగన్ ను ఆలోచనలో పడేస్తున్నాయి.

దీంతో మొదటి నుంచి తనతో నమ్మకంగా ఉన్న వారందరికీ జగన్ కీలక బాధ్యతలను అప్పగిస్తూ, రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
  గత కొంతకాలంగా విజయసాయి రెడ్డి వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

జగన్ నమ్మకాన్ని విజయసాయిరెడ్డి కోల్పోయారని,  అందుకే ఆయనను పక్కన పెట్టారని, చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది.కానీ వాటన్నిటికీ సమాధానంగా జగన్ విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Jagan Handed Over Key Responsibilities To Vijayasai Reddy

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube