విజయవాడలో నిర్వహించిన ఎన్జీవోల మహాసభలకు సీఎం జగన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించేది ఉద్యోగులేనని తెలిపారు.
ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులని సీఎం జగన్ అన్నారు.2019 నుంచి ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించామని పేర్కొన్నారు.ఉద్యోగులకు ఎప్పుడూ సానుకూలంగానే ఉన్నామన్న ఆయన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు.నిజాయితీ, కమిట్ మెంట్ తోనే అడుగులు వేశామన్నారు సీఎం జగన్.రిటైర్డ్ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచామన్నారు.గత ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని విమర్శించారు.
ఎన్నికలకు 6 నెలల ముందు వరకు వేతనాలు పెంచాలనే ఆలోచన కూడా చేయలేదని ఎద్దేవా చేశారు.కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జీతాలను మరింత పెంచామని వెల్లడించారు.