తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరో సిద్ధార్థ్( Siddharth )గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఒక నటుడుగా, గాయకుడిగా ఆయన ఒక తరం యువత గుండెల్లో నిలిచిపోయాడు.
ప్రస్తుతం కూడా సిద్ధార్థ చేసిన సినిమాలంటే ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు.తెలుగులో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలు అప్పటి కుర్రకారును ఎంతగానో అలరించాయి.
ఇక సిద్ధార్థ వ్యక్తిత్వం విషయానికి వస్తే భిన్నమైన పర్సనాలిటీ కలిగిన వాడు.చేస్తున్న సినిమాలు కానీ మాట్లాడే మాటలు కానీ అందరికీ చాలా భిన్నంగా ఉంటాయి.
ప్రేమ, పెళ్లి లాంటి విషయాలుల్లో ఎప్పుడూ కాంట్రవర్సీకి గురవుతూనే ఉంటాడు.అలాగే సినిమాలకు సంబంధించి కూడా ఇటీవల కొన్ని కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్నాడు.
ఇక సిద్ధార్థ్ నటించిన బొమ్మరిల్లు సినిమా లేదంటే నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలు ఎంతటి ఘనవిజయాన్ని సాధించాయో మనందరికీ తెలుసు.2005లో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి ప్రభుదేవా( Prabhu Deva ) దర్శకత్వం వహించగా ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.అంతేకాదు ఈ చిత్రానికి ఏకంగా 15 నంది అవార్డులు వచ్చాయి.అంతే కాదు బొమ్మరిల్లు సినిమా కూడా 2006లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది 13 నందులతో అంతకన్నా ఘన విజయాన్ని కూడా సొంతం చేసుకుంది.
భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఇప్పటికీ అభిమానించే వారు ఉంటారు.
ప్రేక్షకుల దృష్టిలో ఈ రెండు చిత్రాలు ఎంతో గొప్ప చిత్రాలు కావచ్చు కానీ సిద్ధార్థ్ పరంగా మాత్రం ఇవి రెండు అతడికి కాస్త ఇబ్బందిని కలిగించాయట.బొమ్మరిల్లు సినిమాకు 13 నంది అవార్డులు వచ్చాయి అలాగే నువ్వొస్తానంటే నేనొద్దంటానా( Nuvvostanante Nenoddantana ) చిత్రానికి 15 మంది అవార్డులు వచ్చాయి.కానీ ఈ రెండు సినిమాల్లో ఎంతో అద్భుతమైన నటనను కనబరిచిన తనకు మాత్రం ఒక్క అవార్డు కూడా రాలేదని చివరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని తనకు ఎలాంటి అప్రిసియేషన్ కూడా దొరకలేదని అందువల్ల ఇవి నాకు గొప్ప సినిమాలు కావు అని అంటున్నాడు నటుడు సిద్ధార్థ్.
ఈ నటుడు యాంగిల్ లో తను మాట్లాడేది నిజమే అయినా కూడా నంది అవార్డు రాకపోవడానికి గల కారణాలు ఏంటో కచ్చితంగా అయితే తెలియదు.