జీవితంలో గెలిచిన ప్రతి వ్యక్తి గెలుపు వెనుక ఎంతో కష్టం ఉంటుంది.రేయింబవళ్లు కష్టపడితే మాత్రమే కొన్నిసార్లు కోరుకున్న ఫలితాలు సొంతమవుతాయి.
మొదటి ప్రయత్నంలోనే అనుకున్న ఫలితం రాలేదని నిరాశ చెందితే మాత్రం జీవితంలో ఎప్పటికీ గెలవలేము.యూపీఎస్సీ ( UPSC ) నిర్వహించిన సివిల్స్ 2022 తుది ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి.
ఈ ఫలితాల్లో గ్రేటర్ నోయిడాకు చెందిన ఇషితా కిషోర్( Ishita Kishore ) ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం గమనార్హం.
ఇషితా కిషోర్ తొలి, రెండో ప్రయత్నాల్లో కనీసం ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేదు.
మూడో ప్రయత్నంలో మాత్రం సివిల్స్ కు అర్హత సాధించడంతో పాటు టాపర్ గా నిలవడంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇషితా కిషోర్ సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించాలనే ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారని చెప్పాలి.
చదువు పూర్తైన వెంటనే లండన్ లో జాబ్ వచ్చినా ఆ ఉద్యోగం ఆమెకు సంతృప్తినివ్వలేదు.
ఇషితా కుటుంబం మిలిటరీ కుటుంబం కాగా ఇషిత తండ్రి భారత వాయుసేనలో ఉన్నత స్థాయి అధికారిగా పని చేస్తున్నారు.ఫస్ట్ ర్యాంక్ సాధించడం గురించి ఇషిత మాట్లాడుతూ నా ఫ్యామిలీని చూసిన ప్రతిసారి దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన నాలో ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు.నేను పెరిగిన వాతావరణం అలాంటిదని అందుకే సివిల్ సర్వీసెస్ లో( Civil Services ) చేరాలని అనుకున్నానని ఇషిత కామెంట్లు చేశారు.
యూపీఎస్సీ పరీక్షల ఫలితాల్లో ఏకంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఊహించలేదని ఆమె చెప్పుకొచ్చారు.ఐఏఎస్ లో( IAS ) చేరి దేశానికి సేవ చేయడం నా కల అని ఆమె తెలిపారు.ఈ ప్రయాణంలో తల్లీదండ్రులు, స్నేహితులు అండగా నిలిచారని వాళ్లకు ధన్యవాదాలు అని ఆమె కామెంట్లు చేశారు.మెయిన్స్ పరీక్షల కోసం చాలా కష్టపడ్డానని ఇషిత చెప్పుకొచ్చారు.