ఇటీవల తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) లో కీలకమైన పార్టీ పదవులను అధిష్టానం కట్టబెట్టింది.పార్టీపై అసంతృప్తితో ఉన్నవారు , తమకు సరైన ప్రాధాన్యం లేదని అలక చెందిన వారు, ఇలా అందరికీ పార్టీ పదవులు దక్కాయి.
ఇదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తంకుమార్ రెడ్డి( Uttamkumar Reddy )కి పదవి దక్కింది.అయితే ఆయన అంతకుముందు పార్టీ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని, తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని బహిరంగంగా వ్యాఖ్యానించి సంచలనం రేపారు.
తాను బీఆర్ఎస్ పార్టీ( BRS party )లో చేరుతున్నట్లుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతోందని, తాను ఆ పార్టీలోకి వెళ్లడం లేదని ఉత్తంకుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.అయితే ఎవరో కొంతమంది ఆకతాయిలు పెట్టిన పోస్ట్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ స్థాయిలో స్పందించడంపై కాంగ్రెస్ పార్టీలో అయితే ఉత్తంకుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారని , సోషల్ మీడియాలో వచ్చిన చిన్న విషయాన్ని పట్టుకొని ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు .
తాజాగా ఓ బహిరంగ లేఖ రాసిన ఉత్తంకుమార్ రెడ్డి తన ఫిర్యాదుల్ని హై కమాండ్ కూడా పట్టించుకోవడంలేదని అసంతృప్తి వెళ్లగక్కారు.కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో ఆయనను సభ్యుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.ఈ స్క్రీనింగ్ కమిటీ టిక్కెట్లను ఖరారు చేస్తుంది అటువంటి కమిటీలో ఉత్తంకుమార్ రెడ్డికి స్థానం కల్పించి ఆయన ప్రాధాన్యాన్ని పెంచింది.
అయినా ఉత్తంకుమార్ రెడ్డి ఈ పదవితో సంతృప్తి చెందుతారు లేక యధావిధిగా తన అసంతృప్తిని బయటకు వెళ్ళగక్కుతారా అనేది ఆసక్తికరంగా మారింది.అలాగే ఆయన బీఆర్ఎస్ లో చేరితే ఎలా ఉంటుందనే విషయం పైన తన స్నేహితులతో చర్చిస్తున్నట్లుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.