విశాఖలో చోటు చేసుకున్న కానిస్టేబుల్ రమేశ్ అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది.ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రియుడితో కలిసి భార్య శివానినే భర్త రమేశ్ ను కడతేర్చిందని నిర్ధారించారు.
ఈ క్రమంలోనే కానిస్టేబుల్ భార్య నిజాన్ని అంగీకరించిందని పోలీసులు తెలిపారు.ముందుగానే హత్య చేయాలని భావించిన శివానీ తన భర్త రమేశ్ ను చంపేందుకు నీలా అనే వ్యక్తికి రూ.2 లక్షల సుఫారీ ఇచ్చిందని విచారణలో తేల్చారు.పెళ్లికి కట్నం కింద అర ఎకరం భూమి ఇచ్చారు రమేశ్ అత్తమామలు.
ఈ క్రమంలో ఆ భూమిపై కన్నేసిన భార్య శివాని, ప్రియుడు రామారావు భర్తను చంపి భూమిని అమ్మేయాలని ప్లాన్ చేశారని పోలీసులు వెల్లడించారు.తరువాత ప్రియుడితో కలిసి సెటిల్ అవుదామని భావించిన శివాని రమేశ్ ను హత్య చేయించింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాల్ డేటా, వాట్సాప్ చాట్ ఆధారంగా లోతైన దర్యాప్తు జరిపి నిందితులను అరెస్ట్ చేశారు.